Pope Francis: బిగ్ బ్రేకింగ్.. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

Pope Francis died Health Issues: పోప్ ఫ్రాన్సిస్ 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను వాటికన్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం తన నివాసానికి తరలించారు. అయితే శ్వాసకోశ సమస్య తీవ్రంగా మారి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
దక్షిణ అమెరికా నుంచి పోప్ ఫ్రాన్సిస్ పదవిని అందుకున్న తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అప్పటి నుంచి ప్రజల పోప్‌గా ఫేమస్ అయ్యారు. ఇక, ఆయన నిరంతరం సమాజంలో నెలకొన్న పరిస్థితులను ఆయన వ్యాఖ్యలు చేసేవారు. ఇదిలా ఉండగా 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలను ఆయన కడిగారు.
పోప్ ఫ్రాన్సిస్.. 1936 డిసెంబర్ 17వ తేదీన అర్జెంటీనాలో జన్మించారు. ఆ తర్వాత 2013 మార్చి 13వ తేదీన 266వ పోప్‌గా నియామకయ్యారు. అనంతరం అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా ఆయన నిలిచారు. అయితే ఫిబ్రవరిలో శ్వాసకోస సమస్యలతో ఆస్ప్రతిలో చేర్చగా.. చికిత్స తర్వాత కోలుకున్నారు. అలా ఫిబ్రవరి 14 నుంచి దాదాపు 38 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అంతేకాకుండా న్యూమోనియా, కిడ్నీ వంటి వ్యాధులతో బాధపడుతున్నాడు. ఈస్టర్ పురస్కరించుకొని ఆదివారం సందేశం సైతం ఇచ్చారు. ఇక, పోప్ మృతితో క్రైస్తవ సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది.