Last Updated:

Mad Square OTT Partner: ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ ఓటీటీ పార్ట్‌నర్ ఏదో తెలుసా? – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

Mad Square OTT Partner: ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ ఓటీటీ పార్ట్‌నర్ ఏదో తెలుసా? – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

Mad Square OTT Partner and Streaming Details: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌లు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’. 2023 అక్టోబర్‌లో విడుదలైన మ్యాడ్‌ మూవీకి ఇది సీక్వెల్‌. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ బాగా ఆకట్టుకుంటుంది. హిలేరియస్‌ కామెడీ పంచ్‌లతో ఆడియన్స్‌ని ఫుల్‌గా నవ్వించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది.

 

బ్లాక్ బస్టర్ సీక్వెల్

దీనికి సీక్వెల్‌గా మ్యాడ్‌ స్క్వేర్‌ తెరకెక్కించాడు దర్శకుడు కళ్యాణ్‌ శంకర్‌. ఎన్నో అంచనాల మధ్య ఇవాళ (మార్చి 28) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  తొలి షో నుంచి ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఫస్టాఫ్‌ అదిరిపోయిందని, సెకండాఫ్‌ కామెడీ పండలేదనే టాక్‌ వినిపిస్తుంది. కొన్ని సీన్స్‌లో అవసరం లేకపోయిన బలవంతంగా కామెడీని జోడించారంటూ ఆడియన్స్‌ రివ్యూ వస్తుంది.

 

మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ

ప్రస్తుతం మిక్స్‌డ్‌ టాక్‌తో థియేటర్లలో రన్‌ అవుతున్న ఈ సినిమా ఓటీటీ డిటైయిల్స్ కోసం మూవీ అవర్స్‌ ఆరా తీస్తున్నారు. మ్యాడ్‌ స్క్వేర్‌ ఏ ఓటీటీలో రానుంది? ఎప్పుడు ఓటీటీకి వస్తుందా? అప్పుడు వేతికేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ ఓటీటీ వివరాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రిలీజ్‌కు ముందే మ్యాడ్‌ స్క్వేర్‌ ఓటీటీ ఢీల్‌ కుదిరింది. దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ మూవీ రైట్స్‌ కోనుగోలు చేసింది.

 

అప్పుడే ఓటీటీకి

థియేట్రికల్‌ రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్‌ కుదరడంతో రెండు నెలల క్రితమే దీనిపై ప్రకటన ఇచ్చింది సదరు సంస్థ. నెట్‌ఫ్లిక్స్‌ పండగ అంటూ పలు సినిమాలను ప్రకటించింది. అందులో మ్యాడ్‌ స్క్వేర్‌ కూడా ఉంది. కేవలం తెలుగులో మాత్రమే రిలీజైన ఈ సినిమా ఓటీటీలో మాత్రం తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ రానుందని వెల్లడించింది. అయితే థియేట్రికల్‌ రన్‌ పూర్తయిన తర్వాత ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకువస్తామని నెటిఫ్లిక్స్‌ స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం చూస్తే ఈ సినిమా ఏప్రిల్‌ చివరి వారంలో లేదా మే ఫస్ట్‌ వీక్‌ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక త్వరలోనే మ్యాడ్‌ స్క్వేర్‌ ఓటీటీ రిలీజ్‌, స్ట్రీమింగ్‌పై నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)