Published On:

Shah Rukh Khan: భయపడ్డాను.. ఎప్పుడెప్పు పారిపోదామా అని చూశా – మెట్‌ గాలా ఈవెంట్‌ అనంతరం షారుక్‌ రియాక్షన్‌

Shah Rukh Khan: భయపడ్డాను.. ఎప్పుడెప్పు పారిపోదామా అని చూశా – మెట్‌ గాలా ఈవెంట్‌ అనంతరం షారుక్‌ రియాక్షన్‌

Shah Rukh Khan Comments at Met Gala 2025: న్యూయార్క్ వేదికగా జరిగిన మెట్‌గాలా 2025లో పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ సందడి చేశారు. ‘సూపర్‌ఫైన్‌: టైలరింగ్‌ బ్లాక్‌ స్టైల్‌’ అనే థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమంలో షారుక్‌ ఖాన్‌, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా వంటి తారలు తమైదన ఐకానిక్‌ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ నిలిచారు. ఈ వేడుకలకు హాజరైన తొలి భారతీయ నటుడిగా షారుక్‌ రికార్డు సృష్టించారు.

 

ఈ సందర్భంగా సబ్యసాచి డిజైన్‌ చ ఏసిన దుస్తులతో ఆయన మెట్‌గాలా రెడ్‌ కార్పెట్‌పై మెరిసిన. ఇందులో షారుక్‌ చాలా స్టైలిష్‌గా, హ్యాండ్సమ్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన మెడలో ‘K’అక్షరంతో ఉన్న లాకెట్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ షో అనంతరం షారుక్‌ అంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. “ఇంటర్నేషనల్‌ వేదికల్లో రెడ్‌ కార్పెట్‌పై ర్యాంప్‌ వాక్‌ చేయడం ఇదే తొలి అనుభవం. చాలా భయపడ్డాను. ఎప్పుడెప్పుడు పారిపోదామా అని ఆలోచించాను. ఈ ఈవెంట్‌లో భయపడినంతగా నా జీవితంలో నేనేప్పుడు ఇంతలా భయపడలేదు.

 

ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం నా పిల్లలు. వారి కోసం నేను ఈ ఈవెంట్‌కి వచ్చాను. నిజానికి మెట్‌ గాలా నుంచి ఆహ్వానం అందుకున్నప్పుడ నేను ఆశ్చర్యానిక లోనయ్యా. నా ఆహ్వానం అందగానే నా పిల్లలు ఆర్యన్‌ ఖాన్, సుహానా చాలా సంతోషించారు. ఎలాగైన ఈ కార్యక్రమానికి వెళ్లాలని పట్టబట్టారు. అందుకే వచ్చా. ఎందుకంటే నాకు ఫ్యాషన్‌పై ఆసక్తి చాలా తక్కువ. నేనెప్పుడు రెడ్‌ కార్పెట్‌ అనుభవాన్ని పొందలేదు. అందుకే నాకు చాలా భయమేసింది. అంతకంటే చాలా బిడియంగా అనిపించింది” అంటూ చెప్పుకొచ్చారు.

 

ఇక ఈ కార్యక్రమంలో ర్యాంప్‌ వాక్‌ చేస్తున్న క్రమంలో షారుక్‌ తన ఐకానిక్‌ ఫోజ్‌తో అందరిని మెప్పించారు. అనంతరం నా పేరు షారుక్‌ అంటూ తన గురించి అక్కడి వారికి వివరించారు. ప్రస్తుతం మెట్‌ గాలాలో షారుక్‌ చేసిన సందడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ఇదే వేదికలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా బేబీ బంప్‌తో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్ దంపతులు హాలీవుడ్‌ రెట్రో స్టైల్లో దుస్తుల్లో ప్రత్యేకంగా కనిపించారు.