Published On:

Nandamuri Mokshagna: తండ్రి సినిమాతోనే మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ – రంగం సిద్ధం చేస్తున్న బాలయ్య

Nandamuri Mokshagna: తండ్రి సినిమాతోనే మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ – రంగం సిద్ధం చేస్తున్న బాలయ్య

Mokshagna Act in Nandamuri Balakrishna Movie: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్‌ టూ బ్యాక్‌ బ్లాక్‌బస్టర్స్‌, వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇటీవల డాకు మహారాజ్‌తో హిట్‌ కొట్టిన బాలయ్య అదే జోష్‌లో సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్న ఆయన అంతలోనే స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టినట్టు గుసగుసల వినిపిస్తున్నాయి. డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడితో బాలయ్య ఓ సినిమాకు కమిట్‌ అయ్యాడట.

 

బాలయ్య కోసం క్రిష్‌ అదిరిపోయే స్క్రిప్ట్‌ ప్లాన్‌ చేశాడట, స్టోరీ లైన్‌ చెప్పగానే ఆయన ఒకే చెప్పినట్టు సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నందమూరి ఫ్యాన్స్‌ ఖుష్‌ చేసే ఓ వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాలయ్య-క్రిష్‌ సినిమాతోనే నందమూరి మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. కాగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్‌ అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మోక్షు ఎంట్రీ ఇస్తాడా? అని ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అదే సమయంలో ప్రశాంత్‌ వర్మతో ఓ సినిమా అనౌన్స్‌మెంట్‌ జరిగింది. మోక్షజ్ఞ డెబ్యూ బాధ్యతలను బాలయ్య ప్రశాంత్‌ వర్మకు అప్పగించాడన్నారు.

 

చకచక ఈ సినిమా షూటింగ్‌ పూర్తి వచ్చే ఏడాదిలోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తాడిన అంతా అనుకున్నారు. కానీ, ఈ ప్రాజెక్ట్‌ క్యాన్సిల్‌ అయ్యిందంటూ వార్తలు వినిపించాయి. ఆ తర్వాత మూవీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్టు తెలిసింది. దీంతో ప్రశాంత్‌ వర్మ సినిమా కంటే ముందే మోక్షుని ఎంట్రీ బాలయ్య ప్లాన్‌ చేశాడ. తన సినిమాతోనే తనయుడిని పరిచయం చేయాలని అనుకున్నాడు. ఈ మేరకు క్రిష్‌ కూడా మోక్షు ఎంట్రీ అదిరిపోయే రేంజ్‌లో స్క్రిప్ట్‌ ప్లాన్‌ చేస్తున్నాడ. బాలయ్య సినిమాలో అతడికి ఓ కీ రోల్‌ ప్లాన్‌ చేశారట. బాలయ్య కూడా తన తండ్రి తారక రామారావు సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాడు.

 

ఇప్పుడు తన కొడుకుని కూడా అలాగే పరిచయం చేయాలనుకుంటున్నాడట బాలయ్య. అందుకే తన సినిమాలో మోక్షుకి పవర్పుల్‌ అతిథి పాత్రను ప్లాన్‌ చేయమని క్రిష్‌ చెప్పాడట. ఇప్పుడ క్రిష్‌ జాగర్లమూడి అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతా సెట్‌ అయ్యాక త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారికి ప్రకటన రానుంది. ఇదే నిజమైతే మాత్రం ప్రశాంత్‌ వర్మ సినిమా కంటే ముందే మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ ఉండటం ఖాయం అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే బాలయ్య, మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్‌ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి: