Hari Hara Veeramallu: ‘వీరమల్లు’కు మాటల మాంత్రికుడి సాయం – త్రివిక్రమ్ రిస్క్ చేస్తున్నాడా?

Trivikram To Take Hari Hara Veeramallu Final Cut: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిడ్ చిత్రాల్లో హరి హర వీరమల్లు సినిమా ఒకటి. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ముందు రిలీజ్ అయ్యేది వీరమల్లునే. దీంతో ఈ సినిమా అప్‌డేట్స్, రిలీజ్ డేట్ కోసం అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అయితే కొత్త రిలీజ్ డేట్‌ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. మే 30 లేదా జూన్ మొదటి వారంలో విడుదల ఉండోచ్చనే టాక్ వినిపిస్తుంది.
తాజాగా ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. ఇటీవల పవన్ సెట్లో అడుగుపెట్టి షూటింగ్ పూర్తి చేశారు. దీంతో ఏ క్షణమైన మూవీ రిలీజ్ డేట్ తో రానుంది వీరమల్లు టీం. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘వీరమల్లు’కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సాయం అందిస్తున్నారట. చివరి రెండు రోజుల షెడ్యూల్‌లో ఆయన సెట్లోనే ఉన్నారట. చెప్పాలంటే ఆయన దర్శకత్వ పర్యవేక్షణలోనే షూటింగ్ పూర్తయ్యిందని చెప్పాలి. మొదట డైరెక్టర్ క్రిష్ టేకప్ చేసిన ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు చివరిలో త్రివిక్రమ్ వచ్చి చేరడంతో హరి హర వీరమల్లుకు ముగ్గురు దర్శకులయ్యారు.
ఇక త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగనుందట. ఫైనల్ అవుట్ పుట్ బాధ్యతను ఆయన చూసుకుంటున్నారట. ఫైనల్ అవుట్ పుట్, ట్రైలర్ కట్, ప్రమోషన్స్ అన్ని కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. నిజానికి ఈ టైంలో హరి హర వీరమల్లు సినిమా బాధ్యతను త్రివిక్రమ్ తీసుకోవడం రిస్క్ అనే చెప్పాలి. సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చి మూడేళ్లు అవుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడంతో మూవీ మరింత ఆలస్యం అవుతుంది. నిజానికి సినిమా ఆలస్య అవుతున్న కొద్ది దాని బజ్ తగ్గిపోతుంది. కానీ హరి హర వీరమల్లు విషయంలో అలా లేదు. రోజురోజు ఈ మూవీపై బజ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ సినిమా.. పైగా ఆయన పోరాట యోధుడుగా కనిపించబోతున్నాడు.
ఇదే ఆయన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రం కోసం అభిమానులంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఫ్యాన్స్ ఆందోళన కలిగించే విషయమేంటంటే ఈ మూవీ అవుట్ పుట్. ఈ సినిమా స్టోరీ, స్క్రిన్‌ప్లే ఆడియన్స్ మెప్పించగలదా? అనే సందేహాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ మూవీ బాధ్యతలను త్రివిక్రమ్ తీసుకోవడమే సాహసమే అనే చెప్పాలి. ఇప్పటికే ఇద్దరు దర్శకులు ఇందులో వేలు పెట్టారు. మూవీ షూటింగ్ ఎలా జరిగిందనేది వారికే తెలియాలి. ఇలాంటి టైంలో త్రివిక్రమ్ వీరమల్లు అవుట్ పుట్‌ని తనపై ఎత్తుకోవడం తలనొప్పి విషయమే. అభిమానులంత ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ సినిమా తేడా వస్తే అంతే సంగతులు. ఆ బాధ్యతను త్రివిక్రమ్ కూడా మోయాల్సిందే. అయినప్పటి స్నేహితుడి కోసం ఆయన ఈ రిస్క్ తీసుకునేందుకు ముందుకు వచ్చి వీరమల్లు అవుట్ పుట్ బాధ్యతను చేపట్టారు. మరి వీరమల్లు ప్రమోషన్స్, అవుట్ పుట్ ఎలా ఉంటాయోనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తిని, ఆందోళన కలిగిస్తున్న అంశం.