Samantha Defined Success: మహిళలను బంధించి ఇలా ఉండాలి? అది చేయ్యాలని చెప్పడం సక్సెస్ కాదు: సమంత కామెంట్స్

Samantha About Successful Life: సక్సెస్ అంటే విజయం సాధించడం మాత్రమే కాదన్నారు స్టార్ హీరోయిన్ సమంత. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియాలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సిడ్నీలో పాల్గొన్న సమంత కెరీర్‌లో సక్సెస్ అవ్వడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. నిజమైన సక్సెస్ అనేది మీలా మీరు జీవించడం, స్వేచ్చగా బతకడమే అన్నారు. స్వేచ్చగా జీవించడం, మూస ధోరణి భావాలను పట్టించుకోకుండ మీలా మీరు జీవించడమే అన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నా అభిప్రాయం ప్రకారం సక్సెస్ అంటే స్వేచ్ఛ. నువ్వు విజయవంతమయ్యానని నాకు ఒకరు చెప్పేవరకు వేచి చూడను. సక్సెస్ అంటే మనకు నచ్చిన జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడం. అదేవిధంగా మన అభిరుచికి తగ్గట్టుగా పనులు చేయడం. అంతేకానీ మహిళలు ఒక్కచోటు బంధించి నువ్వు ఇలాగే ఉండు? ఇదే పని చేయ్యి? ఇద చేయకూడదనే చెప్పడం కాదు. స్వేచ్ఛ లేనప్పుడు మనకు ఎన్ని విజయాలు సాధించిన అదే వృధానే. నిజ జీవితంలో ఎన్నో రకాల పాత్రలను పోషిస్తూ అన్నింటిలో సమర్థంగా రాణించగలగడమే సక్సెస్” అని చెప్పుకొచ్చారు. ఇక నిర్మాతగా తన కొత్త జర్నీపై కూడా మాట్లాడారు.
కొత్త టాలెంట్‌ని, అద్భుతమైన కథలను ప్రేక్షకులకు అందించేందుకే తాను నిర్మాణ రంగంలోకి అడుపెట్టానన్నారు. చదువుకునే రోజుల్లో తనకు ఓ కల ఉండేదని, అది నేరవేరలేదన్నారు. ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీ యూనివర్సిటీలో చదవాలని అనుకున్నాను. కానీ అది నెరవేరలేదు. అయితే అనుకోకుండా తాను సినిమాల్లో వచ్చానన్నారు. అయితే నటిగా ఎంతోమంది అభిమానం పొందడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరు తమ కలల సాకారం దిశగా అడుగులు వేయాలన్నారు. ఇటీవల సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో అలరించిన సమంత ‘రక్త్ బ్రహ్మాండ్’ సిరీస్‌లో నటిస్తున్నారు. అలాగే ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక నిర్మాతగా తన తొలి ప్రాజెక్ట్‌ని కూడా ప్రకటించారు. శుభం అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఇటీవల సామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
- Rakul Preet Singh: పూరీ జగన్నాథ్ ఫోన్ చేసి ఆఫర్ ఇస్తే.. కుదరదన్నాను, ఎందుకంటే: రకుల్ ప్రీత్ సింగ్