Squid Game 3 Teaser: క్షణం క్షణం భయం, ఉత్కంఠ పెంచుతున్న ‘స్క్విడ్ గేమ్ 3’ టీజర్ – చూశారా?

Squid Game 3 Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం స్రష్టించిన వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’. ఈ కొరియన్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ దక్కించుకుంది. ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్స్ అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాయి. దీంతో ఇప్పుడ మూడో సీజన్‌ని ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. అతి త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ‘స్క్విడ్ గేమ్ 3’ విడుదల కానుంది. కాగా 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది.
ఇక ఇండియాలో ఈ సిరీస్‌కు ఫుల్ క్రేజ్ లభించింది. డబ్బులు ఏరగా వేసి.. ప్రమాదకరమైన ఆటల పేరుతో మనుషుల ప్రాణాలు తీసే ఈ క్రైం థ్రిల్లర్ సిరీస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ సీజన్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో గతేడాది రెండో సీజన్ తీసుకువచ్చింది నెట్‌ఫ్లిక్స్. ఇది కూడా సూపర్ హిట్ అందుకుంది. దీంతో ఇప్పుడు మూడో సీజన్‌ని కూడా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ‘స్క్విడ్ గేమ్ 3’కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసింది నెట్‌ఫ్లిక్స్. జూన్ 27న ఇది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. దీంతో ఈ కొరియన్ థ్రిల్లర్ సిరీస్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్క్విడ్ గేమ్ సిరీస్ కథ విషయానికి వస్తే..
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేదలను టార్గెట్ చేసి కొందరు వారితో ప్రమాదకరమైన ఆటలు ఆడిస్తుంటారు. రియలిటీ షో అని పేదలకు డబ్బు ఆశ చూపించి వారందరిని ఒక్కచోట చేరుస్తారు. డబ్బున్న వాళ్లు వారిని ఆటాడిస్తూ ఆట బొమ్మలా మార్చుకుంటారు. అయితే కాన్పెప్ట్ సింపుల్‌గా ఉన్న.. ఆటలు ఆడించే తీరు, రూల్స్ మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. ఈ ఆటలో ఓడితే ఎలిమినేట్ చేయాలనే నిబంధంన ఉంటుంది. మొత్తం 456 మంది ఒకరితో ఒకరి సంబంధంలేని వారిని.. ఓ రహస్య దీవికి తీసుకువెళతారు.
అక్కడి నుంచి తప్పించుకోవాలన్న వారు బయటపడలేరు. అలాంటి దీవిలో వారందరిని ఉంచి.. టగ్ ఆఫ్ వార్, గోళిలాట, రెడ్ లైట్, గ్రీన్ లైట్ పేరుతో చిన్న పిల్లల ఆటలు ఆడిస్తారు. మొత్తం ఆరు పోటీలు పెట్టి అందులో గెలిచిన వారికి 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీలో 332 కోట్లు) సొంతం చేసకోవచ్చు. ఇక్కడ గేమ్స్ ఆడిస్తూ ఓడిన వారిని ఎలిమినేట్ చేస్తారు. అయితే స్క్విడ్ గేమ్‌లో ఓడిపోయి ఎలిమినేట్ అవ్వడమంటే ప్రాణాలు తీయడమే. అలా తమ ఆనందం కోసం అమాయకమైన ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఈ కథ ఇది. ఇది తెలిసి వారిలో ఉన్న హీరో ఏం చేశాడు? ఎలా ప్రాణాలతో బయటపడ్డాడనేదే ఈ ‘స్క్విడ్ గేమ్’.