Published On:

Varun Tej-Lavanya Tripathi: శుభవార్త చెప్పిన మెగా కపుల్‌ – ఇద్దరు కాస్తా.. ముగ్గురు, తల్లికాబోతోన్న లావణ్య

Varun Tej-Lavanya Tripathi: శుభవార్త చెప్పిన మెగా కపుల్‌ – ఇద్దరు కాస్తా.. ముగ్గురు, తల్లికాబోతోన్న లావణ్య

Varun Tej and lavanya Tripathi Announce Announce Pregnancy: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు ఆ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. అనుకున్నట్టుగానే మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, లావణ్యలు గుడ్‌న్యూస్‌ పంచుకున్నారు. త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్‌ అవుతున్నామంటూ శుభవార్తను  సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు వరుణ్‌, లావణ్యలు కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

 

‘అందమైన పాత్ర.. త్వరలో రాబోతోంది..’

ఈ మేరకు బేబీ సాక్స్‌ ఫోటోని షేర్‌ చేస్తూ.. ‘ఇప్పటివరకు జీవితంలో అత్యంత అందమైన పాత్ర -త్వరలో వస్తోంది’ అంటూ రెడ్‌ హాట్‌ ఎమోజీలను మూడు జత చేశారు. అంటే ఇప్పటి వరకు ఇద్దరిగా ఉన్న తాము త్వరలోనే ముగ్గురం కాబోతున్నామంటూ శుభవార్త షేర్‌ చేసుకున్నారు. దీంతో ఈ మెగా కపుల్‌ ఫ్యాన్స్‌, సినీ సెలబ్రిటీల నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక వరుణ్‌ తేజ్‌-లావణ్య పోస్ట్‌ చూసి హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వావ్‌ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కంగ్రాట్చ్యూలేషన్స్‌ అంటూ లావణ్య-వరుణ్‌లను విష్‌ చేసింది.

 

2023 నవంబర్ 1న పెళ్లి

అలాగే సమంత రూతు ప్రభు, అల్లు స్నేహ రెడ్డి, రితూ వర్మ, హీరో సుశాంత్‌తో పాటు పలువురు సినీ తారలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా మిస్టర్‌, అంతారిక్షం వంటి సినిమాల్లో వీరిద్దరు జంటగా నటించారు. అదే టైంలో ప్రేమలో పడ్డ లావణ్య-వరుణ్‌ ఆరేళ్ల పాటు సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్నారు. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ ఎన్నోసార్లు వార్తలు వచ్చిన.. ఈ జంట సైలెంట్‌గానే ఉంది. ఎన్నడు పెదవి విప్పలేదు. రూమర్స్‌గా ఉన్న వీరి రిలేషన్‌ని పెళ్లి బంధంతో ఆఫీషియల్‌ చేశారు. 2023లో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను షేర్‌ చేసి అందరికి షాకిచ్చారు. అదే ఏడాది నవంబర్‌ 1న ఇటలీలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

 

రెండేళ్లకు గుడ్ న్యూస్

గ్రాండ్‌గా జరిగిన వీరి వెడ్డింగ్‌ ఈవెంట్‌ మెగా, అల్లు కుటుంబం సందడి చేసింది. పెళ్లయిన రెండేళ్లకు ఈ మెగా కపుల్‌ గుడ్‌న్యూస్‌ చెప్పడం అభిమానులంత పండగ చేసుకుంటున్నారు. మెగా ఇంట త్వరలోనే కొత్త మెంబర్‌ రాబోతున్నారంటూ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా గత కొద్ది రోజులు లావణ్య గర్భం దాల్చిందని, వరుణ్‌ తేజ్‌ తండ్రి కాబోతున్నాడంటూ నెట్టింట తెగ ప్రచారం జరిగింది. అయితే ఇది నిజమా? అబద్ధామా అని డైలామాలో ఉన్న ఫ్యాన్స్‌కి ఈ వార్తలను నిజం చేస్తూ వరుణ్‌ తేజ్‌ గుడన్యూస్‌ పంచుకోవడంతో అభిమానుల ఆనందం మరింత రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం ఈ జంటకు సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)