Samantha: అల్లు అర్జున్-అట్లీ సినిమాలో సమంత – క్లారిటీ ఇచ్చిన సామ్

Samantha About Allu Arjun and Atlee Movie: సమంత ప్రస్తుతం శుభం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌లో తెరకెక్కిన్న తొలి చిత్రమిది. హారర్ ఎంటర్టైనర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కాబోతోంది. ఈ నేపత్యంలో నిర్మాతగా శుభం సినిమా ప్రమోషన్స్‌ని స్వయంగా నిర్వహిస్తూ అందలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా సామ్ వరుస్ ఈవెంట్స్, ఇంటర్య్వూలకు హాజరవుతుంది. ఈ క్రమంలో తాజాగా తనకు సంబంధించిన పలు విషయాలపై సమంత స్పందించింది.
తాజాగా మీడియాలో సమావేశంలో పాల్గొన్న సామ్‌కు తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ఇకపై తన వ్యక్తిగత విషయాలపై మాట్లాడం కానీ, ప్రస్తావంచడం కాని చేయొద్దని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేసింది. అలాగే అల్లు అర్జున్-అట్లీ మూవీ రూమర్స్‌పై కూడా స్పందించింది. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించనుందనింటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ప్రశ్నించగా.. ఆ వార్తల్లో నిజం లేదని తెల్చేసింది. ‘అల్లు అర్జున్-అట్లీ సినిమాలో నేను హీరోయిన్గా నటిస్తున్నట్టు వస్తున్న వార్తలను నేను కూడా చూశాను. కానీ అందులో నిజం లేదు. ఆ సినిమాలో నేను నటించడం లేదు. అట్లీ నాకు మంచి స్నేహితుడు. భవిష్యత్తులో తన సినిమాలో అవకాశం వస్తే నటిస్తాను’ అని చెప్పుకొచ్చింది.
తన సినిమా శుభం గురించి చెబుతూ.. ఈ సినిమా ఎనిమిది నెలల్లో పూర్తి చేసినట్టు చెప్పింది. కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న, కొత్త టాలెంట్‌ని ప్రొత్సహించడమే ట్రాలాల ముఖ్య ఉద్దేశం అన్నారు. నటిగా స్టార్డమ్ వచ్చినా.. ఇండస్ట్రీ కోసం ఏదో చేయాలనే ఆలోచన తనని వెంటాడేదని, అందుకే కాస్త విరామం తీసుకుని నిర్మాత అవ్వాలని ఫిక్స్ అయినట్టు చెప్పింది. తన నిర్మాణ సంస్థ రూపొందిన తొలి సినిమాలోనే తాను నటించకూడదని అనుకున్నాను.. కానీ, అతిథి పాత్ర కోసం ఎవరీని అడగలేక తానే నటించానని చెప్పింది. శుభం టీంని చూస్తేంటు తనకు ఏం మాయ చేశావే రోజులు గుర్తొచ్చాయంది.