Naga Chaitanya-Sobhita: తండ్రి కాబోతున్న మరో స్టార్ హీరో నాగచైతన్య – త్వరలోనే గుడ్‌న్యూస్!

Sobhita Dhulipala Pregnant Rumours Viral: మరో టాలీవుడ్ స్టార్ కపుల్ కూడా గుడ్‌న్యూస్ చెప్పుబోతుందట. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు తల్లిదండ్రులు కాబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా తండ్రి కాబోతున్నాడు. త్వరలోనే దీనిపై ప్రకటన రానుందట. ఇంతక ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా?. మరెవరో కాదు అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య. గతేడాది ఈ హీరో నటి శోభితను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
కొన్నాళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరు 2024 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ ఈ కొత్త జంట అప్పుడే గుడ్‌న్యూస్ చెప్పబోతుందట. శోభిత ప్రెగ్నెంట్ అని ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య-శోభితలు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఓ స్టార్ హీరో నుంచి గుడ్‌న్యూస్ రాబోతోందనే వార్త బయటకు రావడంతో అంతా నాగ చైతన్య అనుకున్నారు. కానీ, చివరికి ఆ హీరో వరుణ్ తేజ్ అని తేలిపోయింది. వరుణ్ తేజ్ తాజాగా తన భార్య లావణ్య గర్భవతి అని ప్రకటించాడు.
ఇక ఇప్పుడు నాగ చైతన్య వంతు వచ్చిదని, త్వరలోనే ఈ అక్కినేని హీరో నుంచి శుభవార్త వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే నాగచైతన్య, శోభిత నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేయిట్ చేయాల్సిందే. అయితే కొందరు ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. పెళ్లై 5 నెలలు మాత్రమే అవుతుంది. అప్పుడే ఈ జంట నుంచి శుభవార్త రావడం విశేషమే అవుతుంది. కానీ ప్రస్తుతం శోభిత, చైలు వారి వారి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. నటిగా శోభిత ఇప్పుడిప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తన కెరీర్‌కి బ్రేక్ ఇస్తుందా? అనే సందేహాలు వస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పడాలంటే నాగ చైతన్య-శోభితల రెస్పాన్స్ వచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
- Varun Tej-Lavanya Tripathi: శుభవార్త చెప్పిన మెగా కపుల్ – ఇద్దరు కాస్తా.. ముగ్గురు, తల్లికాబోతోన్న లావణ్య