Published On:

Baahubali Re-Release: గుడ్‌న్యూస్‌.. ‘బాహుబలి’ రీ రిలీజ్‌- అన్‌సీన్‌ పుటేజ్‌, కొత్త సన్నివేశాలతో ఎపిక్‌ సర్‌ప్రైజ్..

Baahubali Re-Release: గుడ్‌న్యూస్‌.. ‘బాహుబలి’ రీ రిలీజ్‌- అన్‌సీన్‌ పుటేజ్‌, కొత్త సన్నివేశాలతో ఎపిక్‌ సర్‌ప్రైజ్..

Baahubali Movie Re Release: తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన మూవీ, తొలి పాన్‌ ఇండియా చిత్రం బాహుబలి మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. ఈ బాహుబలి మూవీ వచ్చి పదేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను మరోసారి రిలీజ్‌ చేయాలని మూవీ నిర్మాతలు నిర్ణయించారు. నిర్మాత శోభూ యార్లగడ్డ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించడంతో అభిమానులంత పండగ చేసుకుంటున్నారు.

 

కాగా దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో డార్లింగ్‌ ప్రభాస్‌, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో.. రమ్యకృష్ణ, నాజర్‌, తమన్నా, తమిళ నటుడు సత్యారాజ్‌ వంటి తదితర నటీనటులు ముఖ్యపాత్రల్లో బాహుబలి సిరీస్‌లు తెరకెక్కాయి. 2015లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. ఒక తెలుగు సినిమాను నేరుగా ఇతర భాషల్లో విడుదల చేసిన ఫస్ట్‌ మూవీ ఇది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. పాన్‌ ఇండియా అంటూ రాజమౌళి చేసిన ఈ ప్రమోగం సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. దీంతో ఇప్పుడు భారత సినీ పరిశ్రమే ఈ ట్రెండ్‌ ఫాలో అవుతుంది.

 

అప్పటి నుంచి ఇతర దర్శకులు సైతం పాన్‌ ఇండియా అంటూ ఈ ట్రెండ్‌ వెనక పరిగేడుతున్నారు. ఈ దెబ్బతో తెలుగు సినీ పరిశ్రమ స్థాయి ఇంటర్నేషనల్‌ లెవెల్‌కు వెళ్లింది. ఒక తెలుగు హీరోని ఇండియన్‌ మూవీ నెం వన్‌ స్టార్‌ని చేసిన ఈ చిత్రం రీరిలీజ్‌ అవుతుండటంతో అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. ఈసారి ఆడియన్స్‌ బాహుబలి టీం సరికొత్త అనుభూతి ఇవ్వబోతోంది. ఈ చిత్రంలో మరిన్ని కొత్త సీన్లు యాడ్‌ చేస్తున్నారట. మనం చూడని అన్‌సీన్స్‌, ఎడిటెడ్‌ సీన్స్‌ని యాడ్‌ చేసి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి కొత్త అనుభూతిని అందించేందుకు మూవీ టీం ప్లాన్‌ చేస్తోంది.

 

రీ-రిలీజ్ అయ్యేది అప్పుడే

అక్టోబర్‌ల్‌లో రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నట్టు మూవీ నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పారు. అయితే డేట్‌ ఎప్పుడనేది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. దీంతో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. అయితే రెండు సిరీస్‌ ఒకేసారి విడుదల చేస్తారా? లేక ఒకదానికి తర్వాత రిలీజ్‌ చేస్తారా? అనేది క్లారిటీ లేదు. ఫస్ట్‌ పార్ట్‌ వచ్చి పదేళ్లు అవుతుంది, సెకండ్‌ పార్ట్‌ వచ్చి ఎనిమిదేళ్లు అవుతుంది. పదేళ్ల ఎపిక్‌ సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటూ రిలీవ్‌దిఎపిక్‌ (RelivetheEpic) పేరుతో సినిమా విడుదల చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.