Published On:

Royal Enfield Recall Alert: రీకాల్ అలర్ట్.. ఈ ఎన్‌ఫీల్డ్ బైకులు వెనక్కి ఇవ్వాలి.. అసలేం జరిగిందంటే..?

Royal Enfield Recall Alert: రీకాల్ అలర్ట్.. ఈ ఎన్‌ఫీల్డ్ బైకులు వెనక్కి ఇవ్వాలి.. అసలేం జరిగిందంటే..?

Royal Enfield Recall Alert: రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. వాస్తవానికి, కంపెనీ తన స్క్రామ్ 440 బుకింగ్, అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. స్క్రామ్ 440 ఇంజిన్ కొంత సమయం పాటు నడిచిన తర్వాత దాని ఇంజిన్ స్టార్ట్ కావడం లేదు. కంపెనీ ఈ ఏడాది జనవరిలో ఈ బైక్‌ను విడుదల చేసింది, ఇది స్క్రామ్ 411 అప్‌గ్రేడ్ వెర్షన్. భారత మార్కెట్లో ఇది హార్లే డేవిడ్సన్ X440,ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X వంటి మోడళ్లతో పోటీపడుతుంది. ఈ సమస్యను సరిదిద్దడానికి కంపెనీ రీకాల్ చేసింది.

 

ఇది ప్రాథమికంగా ఇంజిన్ స్టార్ట్ చేసేటప్పుడు సంభవించే సమస్య. ఉదాహరణకు, ఎవరైనా ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు దాని ఇంజిన్‌ను ఆపివేస్తే, అది మళ్లీ స్టార్ట్ అవ్వదు. సమచారం ప్రకారం.. మోటార్ సైకిల్‌లోని ఈ సమస్య ఇంజిన్‌లోని ఏదో ఒక భాగానికి సంబంధించినది. దీనిని సాంకేతికంగా మాగ్నెటో లోపల వుడ్రఫ్ కీ అని పిలుస్తారు. స్క్రామ్ 440 ఇంజిన్ స్టార్ట్ సమస్య ఎంపిక చేసిన బైక్‌లలో మాత్రమే సంభవించింది. కేవలం 2శాతం బైక్‌లు మాత్రమే ఈ సమస్యతో ప్రభావితమవుతాయి. ప్రస్తుతం కంపెనీ తన బుకింగ్, అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

 

అయితే, రైడర్లు ప్రయాణంలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది, కాబట్టి కంపెనీ ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తోంది. ప్రభావిత యూనిట్లను రిపేర్ చేయడానికి ఇప్పటికే డీలర్‌షిప్‌లకు పంపుతున్నారు. మోటార్ సైకిల్ యజమానులను వ్యక్తిగతంగా సంప్రదించి, సాధ్యమయ్యే సమస్య గురించి తెలియజేస్తున్నారు, సర్వీస్ సెంటర్‌లో దాన్ని మరమ్మతు చేయడానికి అపాయింట్‌మెంట్‌లు బుక్ చేసుకుంటున్నారు. దీన్ని సరిచేయడానికి సైడ్ కవర్, మాగ్నెటో కవర్‌ను తీసివేసే అవసరం రావచ్చు. దీనికి దాదాపు 1-2 గంటలు పట్టవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440లో 440cc LS ఇంజిన్ ఉంది. ఇది సిటీ, ఆఫ్-రోడింగ్‌కు గొప్పగా చేస్తుంది. స్క్రామ్ 411లో 5 గేర్లు, 6 గేర్లు ఉన్నాయి. హైవే క్రూజింగ్ కి బైక్ ని మెరుగ్గా మార్చేది అదనపు గేర్. స్క్రామ్ 440 ప్రారంభ ధర రూ. 2.08 లక్షల ఎక్స్-షోరూమ్. ఇది రౌండ్ హెడ్‌ల్యాంప్,రియర్‌వ్యూ మిర్రర్లు, ఫోర్క్ గైటర్లు, సింగిల్-పీస్ సీటు, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్‌లను కలిగి ఉంది. వైర్-స్పోక్ వీల్స్‌తో ట్రైల్ గ్రీన్, ట్రైల్ బ్లూ, ఫోర్స్ టీల్, ఫోర్స్ గ్రే, ఫోర్స్ బ్లూ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.