Published On:

Belly Fat Reduction: బెల్లీ ఫ్యాట్ పై బ్రహ్మస్త్రం, ఇలా చేస్తే జెల్లీలా కరుగుతుంది!

Belly Fat Reduction: బెల్లీ ఫ్యాట్ పై బ్రహ్మస్త్రం, ఇలా చేస్తే జెల్లీలా కరుగుతుంది!
  • బెల్లీ ఫ్యాట్ పై బ్రహ్మస్త్రం, ఇలా చేస్తే బెల్లీ జెల్లీలా కరుగుతుంది.!

 

Belly Fat Reduction: బెల్లీ ఫ్యాట్ అంటే బొడ్డు చుట్టూ పేరుకుపోయో కొవ్వు. దీన్ని మెడికల్ భాషలో సబ్యూటేనియస్ మరియు విసెరల్ అంటారు. ఇది ఎక్కువగా పేరుకుపోతె గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. సబ్క్యూటేనియస్ కొవ్వు చర్మం కింద ఉంటుంది. ఇది అంత ప్రమాదకారి కాదు. విసెరల్ కొవ్వు శరీరంలోని అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుంటుంది. దీని వలన గుండెజబ్బులు, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.

 

belli fat reduce exercise

belli fat reduce exercise

 

నడక నాలుగు రకాలుగా మేలు
బెల్లీ ఫ్యాట్ రావడానికి ముఖ్య కారణం ఆహారం తీసుకోగానే వాకింగ్ చేయకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం. వ్యక్తి యొక్క ఆహారపు అలవాట్లే అతని జీవితాన్ని నిర్ధేశిస్తాయి. భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేయకపోతే బెల్లీ ఫ్యాట్ వస్తుంది. బొడ్డుచుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. కొందరైతే టీవీ ముందు సోఫాలో కూర్చుని అక్కడే తిని అక్కడే పడుకుంటారు. ఇలాంటి వారికి కాలక్రమేనా బెల్లీ పెరిగిపోతుంది.

 

belli fat reduce exercise walking

belli fat reduce exercise walking

 

మామూలుగా శరీరానికి అవసరమైన అతి తక్కువ కొవ్వును పొట్ట దగ్గర శరీరం స్టోర్ చేసుకుంటుంది. అది కాస్తా మనుషుల అలసత్వం బద్దకం వలన ఎక్కువగా పేరుకుపోయి అనారోగ్యానికి దారితీస్తుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగడానికి చాలా కాలం పడుతుంది. శరీరంలో మిగితా భాగాల కొవ్వుకంటే పొట్టదగ్గర పేరుకుపోయిన కొవ్వు కొంచెం ఆలస్యంగా కరుగుతుంది. ఇలాంటి కొవ్వును విసెరల్ ఫ్యాట్ అంటారు.

 

belli fat reduce exercise walking solutions

belli fat reduce exercise walking solutions

 

బెల్లీ ఫ్యాట్ కరగడానికి మొదటి ప్రయోగం
జీవితంలో ఎలాంటి కష్టాన్నైన దాటడానికి సమయపాలన, కచ్చితత్వం అవసరం. డిసిప్లైన్ మాత్రమే విజయతీరాలకు చేరుస్తుంది. బెల్లీ ఫ్యాట్ ను కరిగించే క్రమంలో ఫస్ట్ స్టెప్ వేగంగా నడవడం. దీన్ని బ్రిస్క్ వాకింగ్ అంటారు. ఇది సాధారణ నడక కంటే వేగంగా నడవాలి. ఫ్యాట్ బర్న్ చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది. మొదట్లో ఒక్క కిలోమీటరు నడకతో మొదలు పెట్టి మెల్లిగా 4 నుంచి 5 కిలోమీటర్లకు పెంచాలి. వేగం మాత్రం తగ్గించకూడదు. ఉదయం సాయంత్రం నడిస్తే మరీమంచిది.

 

belli fat reduce exercise walking process

belli fat reduce exercise walking process

 

షూస్ వేసుకోవడం మంచిది
నడవడానికి షూస్ పాదాలకు గ్రిప్ ను ఇస్తాయి. సరైన బూట్లను వేసుకుంటే పాదాలు రక్షించబడతాయి. మారిన దేశకాలమాన పరిస్థితుల్లో ఇది అత్యవసరం అయింది. ఎందుకంటే పాదాలకు రక్షణ లేకుండా నడిస్తే వాటి అందం ఆకారం పాడవుతాయి. అదే పొలాల్లో పనిచేసే వారు ఎలాంటి పాదరక్షలు లేకుండానే నడుస్తారు. వాళ్లు ఇలాంటి నడకను జీవితంలో సాధారనంగానే కలిగి ఉంటారు కాబట్టి స్లిమ్ గా ఉంటారు. కాకపోతే పాదాలు రఫ్ గా తయారవుతాయి. నగరాల్లో, సిటీల్లో ఉంటూ ఉద్యోగాలు చేసే వారు తమ పాదాలను రక్షించుకోవాలి కాబట్టి తప్పనిసరిగా షూస్ వాడాలి. మంచి షూస్ వాడితే మోకాళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి.

 

belli fat reduce exercise walking shoes

belli fat reduce exercise walking shoes

 

ఎంతసేపు నడవాలి
బరువు తగ్గడానికి చాలా మంది అడిగే ప్రశ్న ఎంత సేపు నడవాలని. అయితే వారికే ఒక ప్రశ్న మీకు ఇష్టమైన విషయాన్ని ఎంత సేపు చేస్తారు, ఇష్టమైన వ్యక్తితో ఎంతసేపు గడుపుతారు. అదే సమాదానం. మామూలుగా అయితే తక్కువలో తక్కువలో 15 నిమిషాలు నడవడం ఆతర్వాత మెల్లిగా సమయాన్ని పెంచుకుంటూ వెళ్లండి. ఒకేసారి వాకింగ్ ను కాని జాగింగ్, రన్నింగ్ నుకాని ఎక్కువసేపు చేయకూడదు. ముందుగా అలవాటు లేని శరీరానికి హింట్ ఇవ్వాలి. మనం ఇప్పటినుంచి నడకను ప్రారంభిస్తున్నాం అని. అప్పుడు శరీరం మానసికంగా ప్రిపేర్ అవుతుంది. మెల్లిగా మొదట ఒక కిలో మీటరు నుంచి ప్రారంభించి 3-5 కిలో మీటర్ల వరకు పెంచండి. ఆ తర్వాత మీ ఓపిక.

 

belli fat reduce exercise walking results

belli fat reduce exercise walking results

 

భోజనం తర్వాత
భోజనం చేసిన తర్వాత తప్పనిసరి 15నిమిషాలు నడవండి. ఇంట్లో అయితే ఈ గదిలో నుంచి మరోగదిలోకి నడవండి. అంతేకాని మానకండి. ఇది ఎంతో ముఖ్యం. ఈ ఒక్క విషయాన్ని అశ్రద్ద చేయడం వలన బెల్లి ఫ్యాట్ పేరుకుపోతుంది. జీర్ణక్రియ సజావుగా ఉండదు. గ్యాస్ నిండిపోతుంది. కావున తిన్న వెంటనే తప్పనిసరిగా 15నిమిషాలు నడవండి. పూర్వమే మన పెద్దలు చెప్పారు. తినగానే 60 అడుగులు వేయాలని.