Published On:

Naga Chaitanya Revange on Samantha: సమంత బర్త్‌డే, మాజీ భర్త నాగ చైతన్య షాకింగ్‌ పోస్ట్‌.. సామ్‌పై చై రివెంజ్‌ ప్లాన్..!

Naga Chaitanya Revange on Samantha: సమంత బర్త్‌డే, మాజీ భర్త నాగ చైతన్య షాకింగ్‌ పోస్ట్‌.. సామ్‌పై చై రివెంజ్‌ ప్లాన్..!

Is Naga Chaitanya Taking Revange on Samantha?: అక్కినేని నాగ చైతన్య, అతడి భార్య, నటి శోభితపై నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లయినప్పటి నుంచి వీరిద్దరు అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా సమంతని టార్గెట్‌ చేస్తూ పోస్ట్స్‌ పెడుతున్నారని రకరకాలుగా కామెంట్స్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. సమంత, నాగ చైతన్య పదేళ్ల రిలేషన్‌ అనంతరం 2017లో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. నాలుగేళ్లు వీరిద్దరు చాలా అన్యోన్యంగా జీవించారు.

 

టాలీవుడ్ క్యూట్ కపుల్ గా..

టాలీవుడ్‌లోనే అత్యంత క్యూట్‌ కపుల్‌గా ఉన్న వీరిద్దరి లైఫ్‌లో హాష్‌(పెంపుడు కుక్క)కూడా ఉంది. దానితో వీరిద్దరికి మంచి అనుబంధం ఉంది. తరచూ సామ్‌ హాష్‌కి సంబంధించిన ఫోటోలు, పోస్ట్స్‌ షేర్‌ చేస్తూ ఉండేది. అలా హ్యాపీ సాగుతున్న వారి వైవాహిక జీవితంలో కలతలు మొదలయ్యాయి. అనూహ్యాంగా వీరు విడాకుల ప్రకటన ఇచ్చి అందరికి షాకిచ్చారు.  వీరిద్దరు విడిపోవడాన్ని ఇప్పటికీ వారి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. విడాకులు అనంతరం సమంత తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదుడుగులు ఎదర్కొంటోంది. కానీ నాగచైతన్య మాత్రం శోభితతో డేటింగ్‌, రిలేషన్‌తో హ్యాపీగా గడిపేస్తున్నాడు.

 

శోభితతో పెళ్లి..

గతేడాదే ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్లయినప్పటి నుంచి వీరిద్దరు ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాధిస్తున్నారు. తరచూ వెకేషన్స్‌, టూర్లకు వెళుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండే నాగ చైతన్య ఇప్పుడు యాక్టివ్‌ అవుతున్నాడు. సమంతతో రిలేషన్‌, పెళ్లి సమయంలో, పెళ్లి తర్వాత కూడా నాగ చైతన్య సోషల్‌ మీడియలో చాలా అరుదుగా కనిపించేవాడు. తన సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ తప్పా.. పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించిన పోస్ట్స్‌ పెట్టవాడు కాదు. ఇదే విషయాన్ని ఎన్నో ఇంటర్య్వూలో చెప్పాడు. ఇక సామ్‌ మాత్రం సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌. దీనిపై కూడా తరచూ సమంతపై కంప్లైంట్‌ చేసేవాడు.

 

అప్పుడు అలా.. ఇప్పుడిలా

అంతేకాదు సమంతలో తనకు నచ్చని విషయం కూడా ఇదేనని నొక్కి చెప్పేవాడు. కానీ, శోభితతో పెళ్లి తర్వాత మాత్రం సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు షేర్‌ చేస్తూ శోభితపై ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. తరచూ పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించిన విషయాలను పంచుకుంటున్నాడు. అలాగే నిన్న ఓ ఊహించని పోస్ట్‌ షేర్‌ చేసి అందరికి షాకిచ్చాడు. ఇది చూసి అంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. చై ఈ పోస్ట్‌ పెట్టడం వెనక అంతర్యం ఏంటని నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. ఆదివారం సందర్భంగా ఇంట్లో సరదాగా గడిపిన క్షణాలు షేర్‌ చేసుకున్నాడు. అయితే ఇందులో తనకు సంబంధించిన ఫోటోలు కాకుండా.. తమ పెంపుడు కుక్క ఫోటోలు షేర్‌ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)

 

సమంతపై రివెంజ్?

హాష్‌తో శోభిత ఉన్న ఫోటోను షేర్‌ చేశాడు. దీనికి ‘సండే ఎవ్రీథింగ్‌’ (Sunday Everything) అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. సమంతకు ఎంతో ఇష్టమైన హాష్‌ ఫోటో.. దానితో శోభిత క్లోజ్‌గా ఉన్న ఫోటో షేర్‌ చేయడం వెనక అర్థమేంటని అంటున్నారు. సామ్‌ పెట్‌ డాగ్‌ శోభిత క్లోజ్‌ ఉండటాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ (ఏప్రిల 28) సామ్‌ బర్త్‌డే. కావాలనే ముందు రోజు ఈ ఫోటోలు షేర్ చేశాడని, ఆమెను టార్గెట్‌ చేస్తూ ఇలా రివేంజ్‌ తీర్చుకుంటున్నాడంటున్నారు. సమంత మన:శాంతి లేకుండ, ఆమె బాధపెట్టడానికి హాష్‌, శోభితల ఫోటోలు షేర్‌ చేశాడని నాగచైతన్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవి చూసి మరికొందరు కూడా నిజమే అంటున్నారు. చూస్తుంటే ఈ పోస్ట్‌ సమంతను టార్గెట్‌ చేస్తూ పెట్టినట్టు ఉందని, వీరిద్దరు సామ్‌ను బాధపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ ఆమె అభిమానులు చై-శోభితలపై భగ్గుమంటున్నారు.