Published On:

Horoscope for Tuesday, May 06, 2025: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగులకు ఇంక్రిమెంట్!

Horoscope for Tuesday, May 06, 2025: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగులకు ఇంక్రిమెంట్!

Horoscope for Tuesday, May 06, 2025: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

మేషం: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా సంపాదించినా ఆదాయం ఖర్చులకే సరిపోతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అన్ని రంగాల వారికి శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శ్రీలక్ష్మీ సహప్రనామం చదవాలి.

వ్యషభం: ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అవసరానికి డబ్బులు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారిని సందర్శించాలి.

మిథునం: ఈ రాశి వారికి శుభప్రదం. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రశంసలు పొందుతారు. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఇష్టదైవాన్ని దర్శించుకోవాలి.

 

కర్కాటకం: ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. అన్ని రంగాల్లో సమస్యలు వస్తాయి. శత్రువుల నుంచి ఆపదలను పరిష్కరించుకుంటారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉండవచ్చు.ఆర్థిక పరిస్థితి పెరగవచ్చు.వేంకటేశ్వర స్వామి వారిని దర్శనం మేలు చేస్తుంది.

సింహం: ఈ రాశి వారికి అనుకూలం. ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. గృహ నిర్మాణం చేపడుతారు. ఇష్టదైవాన్ని పూజించాలి.

కన్య: ఈ రాశి వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పెండింగ్ లో ఉన్న సమస్యలు తీరుతాయి. గోసేవ చేస్తే మంచిది. దైవచింతన అలవర్చుకోవాలి.

తుల: ఈ రాశి వారికి శుభప్రదం. అన్ని రంగాల వారికి ఆర్థికాభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విందు వంటి శుభకార్యాక్రమాల్లో పాల్గొంటారు. ఈశ్వరుడి సందర్శన మంచిది.

వ్యశ్చికం: ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. కీలక పనుల్లో విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆశయం కోసం నిరంతరం పోరాటం చేస్తారు. లాభాలు వస్తాయి. శ్రీలక్ష్మీదేవి దర్శనం చేసుకుంటే మంచిది.

ధనుస్సు: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. ప్రణాళికలతో పనులు చేపడతారు. పెండింగ్ సమస్యలను పెద్దల సహకారంతో పూర్తి చేస్తారు. వ్యాపారంలో కీలక మార్పులతో ఆకట్టుకుంటారు. ఇష్టదేవతను ఆరాధించాలి.

 

మకరం: ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. రాజకీయాల్లో రాణిస్తారు. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు ఉంటాయి. ఒత్తిడి లేకుండా పనులు పూర్తి చేసుకోవాలి. ఇష్టదేవతను పూజించాలి.

కుంభం: ఈ రాశి వారికి శుభ ఫలితాలు. అన్ని రంగాల వారికి సమయానికి పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. శివారాధన మంచిది.

మీనం: ఈ రాశి వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఆపదల నుంచి బయటపడతారు. కీలక సమయంలో డబ్బు చేతికి అందుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. స్వల్పంగా ధన లాభం ఉంటుంది. శివుడిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి: