Ashu Reddy’s ‘Padmavyuham Lo Chakradhari’: సర్‌ప్రైజ్.. సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన అషు రెడ్డి రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Ashu Reddy’s Padmavyuham Lo Chakradhari Movie OTT Streaming: అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టిక్‌టాక్ ద్వారా జూనియర్ సమంతగా లైమ్ లైట్లోకి వచ్చిన ఈ భామ ఆ తర్వాత సోషల్ మీడియా, రియాలిటీ షోలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇక సడెన్‌గా కామెడీ షోలో యాంకర్‌గా దర్శనం ఇచ్చింది. ఆ తర్వాత ఆర్జీవీని ఇంటర్య్వూ చేసి సెన్సేషన్ అయ్యింది. మొన్నటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌గా ఉన్న అషు రెడ్డి ఇటీవల వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
ఆమె ప్రధాన పాత్రలో ‘పద్మవ్యూహంలో చక్రధారి’ అనే సినిమా తెరకెక్కింది. టాలెంటెడ్ యాక్టర్ ప్రవీన్ రాజ్‌కుమార్ హీరోగా అషు రెడ్డి, శషికా టిక్కూలు హీరోయిన్లుగా నటించారు. లవ్, రొమాంటిక్ డ్రామా రూపొందిన ఈ చిత్రం గతేడాది థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండ సైలెంట్ ఓటీటీకి రావడంతో అంత షాక్ అవుతున్నారు. పైగా అషు రెడ్డి సినిమా కావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ఓటీటీ ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు.
2024 జూన్ 21న ‘పద్మవ్యూహంలో చక్రధారి’ సినిమా థియేటర్లో విడుదలైంది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అషు రెడ్డి టీచర్ పాత్రలో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే దాదాపు పది నెలల తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఎలాంటి ప్రకటన, అప్‌డేట్ లేకుండ సడెన్ అమెజాన్‌లో అషు రెడ్డి మూవీ దర్శనం ఇవ్వడంతో అంతా షాక్ అవుతున్నారు. సినిమా చూద్దామని క్లిక్ చేసిన ఆడియన్స్‌కి మాత్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది అమెజాన్ ప్రైం. ఈ సినిమా చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ ఉంటే సరిపోదు. అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంది.
అంటే రెంటల్ పద్దతిలో ఈ సినిమా అందుబాటులోకి తీసుకువచ్చి ట్విస్ట్ ఇచ్చింది అమెజాన్. దాదాపు ఏడాది తర్వాత ‘పద్మవ్యూహంలో చక్రధారి’ మూవీ ఓటీటీకి రాడవంతో ఖుషి అయిన ఫ్యాన్స్ అంతలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రెంటల్ విధానం కొన్ని రోజులే పాటే ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా ఫ్రీగా అందుబాటులోకి తీసుకురానుంది అమెజాన్ ప్రైం. రాయలసీమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అషు రెడ్డి టీచర్ పాత్ర పోషించింది. అయితే ఇంట్లో వాళ్లు ఆమెకు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు ఎప్పుడు బాధలో ఉండే వివాహితగా అషు రెడ్డి తనదైన నటనతో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో గ్లామరస్‌గా కనిపించే ఆమె ఈ సినిమాలో పద్దతిగా, అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది.