Published On:

Pope Francis : నేడు పోప్‌ అంత్యక్రియలు.. రోమ్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Pope Francis : నేడు పోప్‌ అంత్యక్రియలు.. రోమ్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Pope Francis : క్యాథ‌లిక్ క్రైస్తవ మ‌ఠాధిప‌తి పోప్ ఫ్రాన్సిస్ (88) సోమ‌వారం తుదిశ్వాస విడిచారు. ఆరు రోజులపాటు ఆయన భౌతికకాయాన్ని సెయింట్‌ పీటర్స్‌ బసిలికాలో ఉంచారు. లక్షలాది మంది ప్రజలు తరలివచ్చి పోప్‌కు కడసాని నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఇవాళ పోప్‌ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 

అంత్యక్రియల్లో ప్రపంచ దేశాల అధినేతలు..
పోప్‌ ఫ్రాన్సిస్ అంత్యక్రియకు ప్రపంచ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మెక్రాన్‌, యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ‌పాటు తదితరలు పాల్గొననున్నారు. ఇండియా తరఫున రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్నారు. ఇప్పటికే ముర్ము వాటికన్‌ సిటీకి బయల్దేరి వెళ్లారు. కేంద్ర మంత్రులు కిర‌ణ్ రిజిజు, జార్జ్ కురియ‌న్‌, గోవా డిప్యూటీ స్పీక‌ర్ వెళ్లారు.

 

కేంద్ర ప్రభుత్వం ప్రజ‌ల త‌ర‌ఫున సంతాపం తెలియ‌జేయ‌నున్నది. ట‌ర్స్ స్క్వేర్‌లో జ‌రుగనున్న సామూహిక ప్రార్థన‌ల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ నెల 21న వాటిక‌న్‌లోని కాసా శాంటా మార్టా నివాసంలో ఫ్రాన్సిస్ తుదిశ్వాస విడిచారు. 2013 మార్చి 13న ఆయ‌న పోప్ బెన‌డిక్ట్ నుంచి బాధ్యత‌లు స్వీక‌రించారు.

 

 

ఇవి కూడా చదవండి: