Published On:

Pakistan Hindu Refugees: భారత్ లో చచ్చినా సరే.. పాక్ కు వెళ్లమంటున్న హిందూ శరనార్థులు

Pakistan Hindu Refugees: భారత్ లో చచ్చినా సరే.. పాక్ కు వెళ్లమంటున్న హిందూ శరనార్థులు

 

Pakistan Hindu Refugees: పాకిస్థాన్ లో మతపరమైన హింసకు గురై భారత్ కు వచ్చిన హిందు శరణార్థుల పరిస్థితి దారుణంగా మారింది. పాకిస్థాన్ జాతీయులను వెనక్కిపంపాలన్న కేంద్ర నిర్ణయం వీరి ప్రాణాలకు చుట్టుకుంది. తాము చచ్చినా భారత్ లోనే చస్తాము కాని పాకిస్థాన్ కు మాత్రం వెళ్లనంటున్నారు హిందూ శరణార్థులు. దేశాన్ని వదిలివెళ్లే సమయం దగ్గర పడుతుండటంతో భయంతో వణికిపోతున్నారు.

 

ఏప్రిల్ 22న కాశ్మీర్ లోని పహల్గాంలో 26మంది టూరిస్టులను తీవ్రవాదులు మతంపేరిట కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఇందులో పాకిస్థాన్ హస్తం ఉందని తెలుసుకున్న భారత్ ఆ దేశంపై దౌత్య సంబంధాలను కఠినతరం చేసింది. అందులో భాగంగానే సింధూ జలాలను నిలిపివేయడం, పాక్ జాతీయులను తిరిగి పంపించేయడం లాంటి నిర్ణయాలను తీసుకుంది.

 

రాజస్థాన్ లోని జైసల్మర్ లో ఒక శరణార్థి కాలని ఉంది. అందులో వాఘా-అట్టారి సరిహద్దు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన అనేక కుటుంబాలు నివసిస్తున్నాయి. స్వల్పకాలిక వీసాలపై భారతదేశానికి వచ్చిన వెయ్యి మందికి పైగా హిందూ శరణార్థులు ఇక్కడే ఉంటున్నారు. పాకిస్థాన్ కు చెందిన ఏక్లమ్య భిల్ బస్తీ అనే వ్యక్తి పహల్గాం దాడి జరిగే కొన్ని రోజుల ముందు భారత్ లోకి శరణార్థిగా కుటుంబంతో పాటు వచ్చాడు. అంతలోనే పహల్గాం దాడి జరగడంతో  వీరికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

 

సింధ్‌లో నివసించే ఖేటో రామ్ పాకిస్థాన్ లో నిరంతర వేధింపుల కారణంగా ఆదేశాన్ని విడిచి వచ్చాడు. మంగళవారం పహల్గాంలో దాడి జరిగిన కొన్ని గంటల ముందు ఆయన కుటుంబంతో సహా ఇద్దరు కుమారులు భారత్ కు చేరుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు తెలుసుకుని బోరుమంటున్నాడు. అయితే తాము ఇక్కడే చావనైనా చస్తాము కాని పాకిస్థాన్ కు తిరిగి వెళ్లమని విలపిస్తున్నాడు. తమ కేసులను భారత ప్రధాని పరిగనలోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు.

(USCIRF) తాజా నివేదిక

(USCIRF) తాజా నివేదిక

హిందూ శరణార్థులు తిరిగి పాకిస్థాన్ కు వెళ్తే మతపరమైన హింసకు గురవుతారని భయపడుతున్నారు. అంతర్జాతీయ మత స్వేచ్చ యుఎన్ కమిషన్ (USCIRF) తాజా నివేదిక ప్రకారం పాకిస్థాన్ లో హిందూ మైనారిటీల మరింత దిగజారిందని తెలిపింది. కాగా పాక్ దేశస్థులు తిరిగి వెళ్లేందుకు ఏప్రిల్ 27 వరకు గడువును భారత ప్రభుత్వం నిర్ణయించింది.