Chiranjeevi: డైరెక్టర్‌కి గర్వం ఉండకూడదు.. బాబీ నా మాట విన్నాడు.. ఇప్పుడు వినేవాళ్లే లేరు
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించింది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య”. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు.
ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను చిత్రబృందం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.
ఈ సంధర్భంగా చిరంజీవి(Chiranjeevi) మాట్లాడుతూ.. నేటి తరం దర్శకులకు తనదైన శైలిలో చురకలు అంటించారు. డైరెక్టర్‌కి గర్వం ఉండకూడదు.. బాబీ నా మాట విన్నాడు..
ఇప్పుడు వినేవాళ్లే లేరు అని వ్యాఖ్యానించారు. నిర్మాతల డబ్బును బుట్టదాఖలు చేయవద్దని, సినిమాకు కావాల్సినవన్నీ పేపర్ వర్క్ లోనే పూర్తి చేసేయాలని చిరంజీవి దర్శకులకు సూచించారు.
ఈ సినిమా కథ అందరూ బాగుంది అని చెప్పినా బాబీని నేను పిలిచి పర్సనల్ గా ఇది బిలో యావరేజ్ సినిమా అని చెప్పి దీని మీద మరింత వర్క్ చేయమని చెప్పాను.
అందరూ బాగుంది అన్నారు కదా.. అని చెప్పకుండా దాని మీద వర్క్ చేశాడు. సినిమా షూట్ టైములో కూడా ఎన్నో చేంజెస్ అప్పటికప్పుడు చేశారు.
సినిమా రిలీజ్ అయ్యేదాకా అందరూ చెప్పే డౌట్స్ ని బాబీ తన టీంతో కూర్చొని డిస్కస్ చేస్తూ సాల్వ్ చేసుకుంటూ వచ్చాడు అని అన్నారు.
కాబట్టే ఇంత మంచి సినిమా వచ్చింది. ఎక్కడా ఇగోకి వెళ్లకుండా ఎవరు చెప్పినా వింటూ, దాని మీద మరింత కష్టపడి మంచి సినిమాని తీశాడు.
డైరెక్టర్స్ ఇగోలకు వెళ్లకూడదు..
డైరెక్టర్స్ ఇగోలకి వెళ్ళకూడదు. డైరెక్టర్ సినిమా హిట్ ఇవ్వడం కాదు. ఇచ్చిన టైములో, ఇచ్చిన బడ్జెట్ లో సినిమాని తీయగలగాలి.
ఎవరో డైరెక్టర్ భారీగా తీశారు కదా అని మనం అక్కర్లేకపోయినా భారీగా వెళ్ళకూడదు అబీ హితవు పలికారు. సినిమాని షూట్ చేసి ఇది అక్కర్లేదు అని ఎడిటింగ్ లో కట్ చేయకూడదు.
అలా చేయడం వాళ్ళ డబ్బు, టైం, కష్టం అంతా వేస్ట్ అవుతుంది. అదంతా నిర్మాతలకి నష్టమే. ఏ మార్పులు, చూపులు ఉన్నా పేపర్ వర్క్ మీదే చేసుకోవాలి.
అంతా ఓకే అనుకున్నాకే షూట్ కి వెళ్ళండి అంటూ సలహా ఇచ్చారు. నిర్మాతలు బాగుంటేనే మనం బాగుంటం.. సినీ పరిశ్రమ బాగుంటుంది అని చెప్పారు.
ఈ విషయం దర్శకులు గుర్తించాలి అని అన్నారు. వాల్తేరు వీరయ్య ఔత్సాహిక దర్శకులకు కేస్ స్టడీలాగా ఉపయోగపడుతుందని తెలిపారు.
అలాగే ఈ వ్యాఖ్యలని ఏ డైరెక్టర్ ని ఉద్దేశించి చేయలేదు, దయచేసి మీడియా వాళ్ళు తప్పుగా రాయకండి అని చిరంజీవి కోరారు.
ఈ సినిమా కోసం వారు పడిన కష్టాన్ని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదని మెగాస్టార్ అన్నారు.
ఈ మేరకు వాల్తేరు వీరయ్య సినిమా కోసం పనిచేసిన కార్మికులను చిరంజీవి స్వయంగా ఘాట్ చేసిన వీడియోను విడుదల చేశారు.
కష్టం నాది, రవితేజది కాదు.. సినిమా బాగా రావాలని పనిచేసిన వారిందరిదీ అని అన్నారు. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు.. మంచి సినిమా ఇచ్చినందుకు వాళ్లే థ్యాంక్స్ చెబుతున్నారు అని చిరంజీవి చెప్పారు. ప్రస్తుతం చిరు చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/