Published On:

Samantha Re-entry in ‘X’: ‘ఎక్స్‌’లోకి సమంత రీఎంట్రీ.. ఫస్ట్ పోస్టు ఇదే!

Samantha Re-entry in ‘X’: ‘ఎక్స్‌’లోకి సమంత రీఎంట్రీ.. ఫస్ట్ పోస్టు ఇదే!

Samantha Re-entry in ‘X’ Account First Post on New Movie Shubham: స్టార్ హీరోయిన్ సమంత అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. టాలీవుడ్‌ను ఏ మాయ చేశావే సినిమాతో అందరినీ మాయ చేసింది. ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల్లో తొలి స్థానం సంపాదించుకుంది. అయితే, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సమంత.. సడెన్‌గా మాయమైపోయారు.

 

2012లో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన సమంత.. అప్పటినుంచి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేవారు. నిత్యం తనకు సంబంధించిన పోస్టులతో ఫ్యాన్స్‌తో పాటు ఫాలోవర్స్‌ను పలకరించేవారు. కానీ ఆ తర్వాత తన పోస్టులు ఒక్కొక్కటి డిలీట్ చేస్తూ ఇటీవల అన్నిటినీ డిలీట్ చేశారు. ఇక ట్విట్టర్.. ఎక్స్‌గా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే.

 

కాగా, ఎక్స్ దూరమైన సమంత అప్పటినుంచి ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్ బుక్ , యూట్యూబ్‌లలో యాక్టివ్ అయ్యారు. తాజాగా, సమంత మళ్లీ ఎక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు ఆమె ఇన్‌స్టా, ఫేస్ బుక్, యూట్యూబ్‌లోనే యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పుడు ఎక్స్‌లో కూడా యాక్టివ్‌గా ఉండేందుకు సిద్ధమయ్యారు.

 

ఈ మేరకు ఎక్స్‌లో రీఎంట్రీ ఇచ్చిన సమంత.. తొలి పోస్టు చేసింది. 2023లో నిర్మాతగా మారిన సామ్.. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది. ఈ సంస్థ నిర్మిచి తొలి సినిమా ‘శుభం. తాను నిర్మించిన ‘శుభం’ సినిమా విశేషాలను తెలుపుతూ మొదటి పోస్టు చేసింది.

 

‘పెద్ద పెద్ద కలలతో చిన్న ప్రేమను అందిస్తున్నా. మేము నిర్మించిన ఈ సినిమాను అందరూ ఆదరస్తారని అనుకుంటున్నా. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఇది గొప్ప ప్రారంభం’. అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇది చూసిన ఫాలోవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సామ్‌కు ఎక్స్‌లో ఇప్పటికే 10.2మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.