Published On:

Chiranjeevi Advice to Tamanna: తమన్నా-విజయ్‌ వర్మ బ్రేకప్‌ – చిరంజీవి సలహా

Chiranjeevi Advice to Tamanna: తమన్నా-విజయ్‌ వర్మ బ్రేకప్‌ – చిరంజీవి సలహా

Chiranjeevi Advice to Tamannaah About Break Up With Vijay: హీరోయిన్‌ తమన్నా, విజయ్‌ వర్మలు బ్రేకప్‌ చెప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు చెట్టాపట్టేసుకుని తిరిగిన ఈ జంట ప్రస్తుతం సింగిల్‌గా కనిపిస్తున్నారు. రీసెంట్‌గా ఒకే హోలీ వేడుకలో పాల్గొన్న వీరిద్దరు కనీసం పలకరించుకోలేదట. అది చూసి త్వరలోనే పెళ్లి కబురు చెబుతారనుకుంటే ఇలా విడిపోయారేంటని అభిమానులతో పాటు సన్నిహితులు సైతం వాపోతున్నారు.

 

అయితే ఓ వైపు విడిపోయారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నా.. విజయ్‌, తమన్నాలు మాత్రం ఈ వార్తలపై స్పందించడం లేదు. అయితే ఈ బ్రేకప్‌ని అధికారికంగా ప్రకటించమని మెగాస్టార్‌ చిరంజీవి తమన్నాకు సలహా ఇచ్చారని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నిజానికి విజయ్‌-తమన్నాలు ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్నారట. అయితే ఇప్పుడిప్పుడే తనకు సినిమాల్లో ఆఫర్స్‌ వస్తున్న తరుణంలో విజయ్ పెళ్లిపై ఆసక్తి చూపించడం లేదట. దీంతో తమన్నా విజయ్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.

 

ఇదే విషయాన్ని తన తండ్రికి కూడా చెప్పేసింది. విజయ్‌ తనకు కట్టుబడి ఉన్నట్టు కనిపించడం లేదని, అందుకే అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిందట. మరి.. మీ బ్రేకప్‌ విషయాన్ని ఎలా చెబుతావని అడగ్గా.. అవసరం లేదని చెప్పిందట. ఈ విషయాన్ని బయటకు చెప్పాల్సిన అవసరం లేదని, దీనిపై మౌనంగా ఉంటానని తన అభిప్రాయాన్ని చెప్పిందట. అయితే ఈ విషయంలో మెగాస్టార్‌ కలుగజేసుకుని మీ బ్రేకప్‌ విషయాన్ని మీడియాకు వెల్లడిస్తేనే బాగుంటుందని సలహా ఇచ్చినట్టు జాతీయా మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.