Published On:

Mahesh Babu: ఈడీ విచారణకు సమయం కోరిన మహేష్ బాబు

Mahesh Babu: ఈడీ విచారణకు సమయం కోరిన మహేష్ బాబు

Mahesh Babu: సాయి సూర్య, సురానా కేసులో ఈడీకి మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకుగాను ఈడీ అధికారులకు నటుడు మహేష్ బాబు లేఖ రాశారు. రేపు విచారణకు రాలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. విచారణకు మరో తేదీ కేటాయించాలని ఈడీ అధికారులను మహేష్ బాబు కోరారు. సాయిసూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇవ్వగా షూటింగ్ ఉందంటూ మహేష్ బదులిచ్చాడు. సాయిసూర్య డెవలపర్స్‌కు ఆయన ప్రచారకర్తగా ఉన్నాడు.

 

వివిధ బ్యాంకుల్లో సాయి, సురానా సంస్థలు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టాయి. దీంతో ఈ సంస్థలకు సంబంధించిన వారిని ఈడీ విచారిస్తుంది. సురానా గ్రూప్ అధికారుల ఇళ్లల్లో సోదాలు జరిగాయి. భారీగా నగదు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సురానా గ్రూపుకు చెందిన షెల్ కంపేనీలు ఏర్పాటు చేసి అక్రమలావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది.

 

ప్రమోషన్‌లో భాగంగా సురానా, సాయి సూర్యా డెవలపర్స్ నుంచి మహేష్ బాబు 5.9 కోట్లు తీసుకున్నారని ఈడీ తెలిపింది. అందులో 3.4కోట్ల నగదు, ఆర్టీజీఎస్ ద్వారా రూ.2.5కోట్లను తీసుకున్నారని చెప్పారు. ఏప్రిల్ 28న విచారణకు రావాల్సిందిగా అధికారులు నోటీసులు ఇవ్వగా మరో తేదీని నిర్ణయించాలని మహేష్ బాబు అధికారులను కోరారు.