Published On:

#Mega157 Update: మెగాస్టార్ కు విలన్ గా ఆ కుర్ర హీరో.. సెట్ అవుతాడా..?

#Mega157 Update: మెగాస్టార్ కు విలన్ గా ఆ కుర్ర హీరో.. సెట్ అవుతాడా..?

Karthikeya as a Villain in Chiranjeevi’s Mega 157: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. మొదటిసారి చిరు సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. వీరిద్దరూ గతంలో స్టాలిన్ సినిమాలో జోడిగా మెరిశారు. చాలా కాలం తరువాత ఈ జంట ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది.

 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విశ్వంభర తరువాత చిరు నటిస్తున్న చిత్రం మెగా 157. హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమాలో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

 

ఇప్పటికే ఈ సినిమాలో చిరుతో పాటు వెంకటేష్ కూడా కలిసి నటిస్తున్నాడని ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఇప్పుడు మరో వార్త సైతం అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మెగా 157 లో చిరుకు విలన్ గా యంగ్ హీరో కార్తికేయను సెలెక్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన కార్తికేయ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్నాడు.

 

ఇక నాని నటించిన గ్యాంగ్ లీడర్ లో స్టైలిష్ విలన్ గా కనిపించి మెప్పించాడు. ఆ సినిమాలో నాని కన్నా కార్తికేయకే ఎక్కువ మార్కులు పడ్డాయంటే అతిశయోక్తి కాదు. కార్తికేయ విలనిజాన్ని చూసిన నెటిజన్స్ హీరోగా కాకుండా విలన్ గా అతనికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు అదే విలనిజం కార్తికేయకు మెగా 157 లో ఛాన్స్ వచ్చేలా చేసింది.

 

కార్తికేయకు చిరు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగి, ఆయన ఇన్స్పిరేషన్ తోనే సినిమాలోకి వచ్చిన ఈ కుర్ర హీరో ఇప్పుడు చిరు సినిమాలోనే ఛాన్స్ పట్టేశాడు. అతని లైఫ్ కి ఇంతకు మించిన అచీవ్ మెంట్ లేదని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

 

అయితే కార్తికేయ చిన్న వయస్సు కావడంతో.. చిరుకు ధీటుగా విలనిజాన్ని పంచగలడా.. ? విలన్ రోల్ కు సెట్ అవుతాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే కార్తికేయ లైఫ్ కు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పొచ్చు. మరి అనిల్ రావిపూడి ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తాడేమో చూడాలి.