అనంతపురం జిల్లాలో దారుణం.. ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత హత్య

MRPS Leader Murdered : అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఆలూరు నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో ఆలూరు రోడ్డు చిప్పగిరి రైల్వే బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గుంతకల్ నుంచి లక్ష్మీనారాయణ వెళ్తుండగా హత్య చేశారు. లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని టిప్పర్‌తో ఢీకొట్టారు. కారులో చిక్కుకున్న అతడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేశారు. స్థానికులు గమనించి వెంటనే లక్ష్మీనారాయణను ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. ఆసుపత్రికి తరలించే క్రమంలోనే ప్రాణాలు విడిచినట్లుగా చెబుతున్నారు. ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడిగా పనిచేస్తూ.. ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఉన్న లక్ష్మీనారాయణపై ఎవరు? దాడి చేశారు. ఆయనపై దారుణంగా దాడిచేయాల్సిన అవసరం ఏమి వచ్చింది..? ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారు? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.