Published On:

Vishwambhara Release Date: ‘విశ్వంభర’ సినిమాకు ఇంద్ర సెంటిమెంట్‌ – సమ్మర్‌ రేస్‌ నుంచి తప్పుకున్నట్టేనా?

Vishwambhara Release Date: ‘విశ్వంభర’ సినిమాకు ఇంద్ర సెంటిమెంట్‌ – సమ్మర్‌ రేస్‌ నుంచి తప్పుకున్నట్టేనా?

Vishwambhara Team Follows Indra Sentiment: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. బింబిసార వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న చిత్రమిది. పైగా మెగాస్టార్‌ కథానాయకుడిగా నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో విశ్వంభర రిలీజ్‌ డేట్‌ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంక్రాంతి నుంచి అవుట్

నిజానికి ‘విశ్వంభర’ మూవి సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల ఇది వాయిదా పడింది. కానీ, ఇప్పటి వరకు కొత్త రిలీజ్‌ డేట్‌కి సంబంధించిన ఎలాంటి ఆఫీషియల్‌ అప్‌డేట్‌ లేదు. అయితే విశ్వంభర విడుదల తేదీకి సంబంధించిన మాత్రం రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. వారానికో రిలీజ్‌ డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదట మే 9న అన్నారు. ఆ తేదీని పవన్‌ కళ్యాణ్‌ హరి హర వీరమల్లు లాక్‌ చేసుకుంది. ఇక సమ్మర్‌లోనే విశ్వంభర వచ్చేది ఇండస్ట్రీలో టాక్‌. అయితే ఇప్పుడు సమ్మర్‌ రేస్‌ నుంచి కూడా తప్పుకుందని తెలుస్తోంది.

 

ఇంద్రపై కన్నేసిన ‘విశ్వంభర’

తాజా బజ్‌ ప్రకారం విశ్వంభర టీం చిరంజీవి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇంద్ర మూవీ రిలీజ్ డేట్‌పై కన్నేసిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ రిలీజ్‌ డేట్‌ మే 9న విశ్వంభర చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని అనుకున్నారు. కానీ ఆ డేట్‌పై హరి హర వీరమల్లు టీం కన్నేసింది. దీంతో విశ్వంభర చిరు పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 22న రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారట. అయితే ఇప్పుడు ఆ ఆలోచన మానుకుని ఇంద్ర సెంటిమెంట్‌ని ఫాలో అవ్వాలనుకుంటున్నారట. చిరు హిట్‌ మూవీ ఇంద్ర రిలీజ్‌ డేట్‌ జూలై 24న విశ్వంభర మూవీని విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

 

ఇంద్ర అదే రోజు విడుదలై ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. దీంతో ఇప్పుడు అదే డేట్‌కి విశ్వంభరను థియేటర్లోకి తీసుకురావాలని మూవీ టీం ప్లాన్‌ చేస్తుందట. మరి ఇంద్ర సెంటిమెంట్ విశ్వంభరకు వర్కౌట్‌ అవుతుందా? లేదా? చూడాలి. అయితే దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేవరకు వేయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే ‘విశ్వంభర’ షూటింగ్‌ దాదాపు పూర్తయ్యిందట. ఒక పాట మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసినట్టు సినీవర్గాల నుంచి సమాచారం. దీంతో మూవీ టీం ప్రస్తుతం గ్రాఫిక్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌పై దృష్టి పెట్టిందట. అయితే ఈ నెల 19న నందిగామలోని హనుమంతుని విగ్రహం దగ్గర మొదటి పాట విడుదల చేయడానికి విశ్వంభర టీం సన్నాహాలు చేస్తుందని సమాచారం.