Published On:

Father shoots daughter : ప్రేమ వివాహం చేసుకున్న కూతురు.. పెళ్లి వేడుకలో కాల్చి చంపిన తండ్రి

Father shoots daughter : ప్రేమ వివాహం చేసుకున్న కూతురు.. పెళ్లి వేడుకలో కాల్చి చంపిన తండ్రి

Father shoots daughter to death with gun : ఓ యువతి తన తండ్రికి ఇష్టంలేని ప్రేమ వివాహం చేసుకున్నది. బంధువుల ఇంట్లో జరిగే వివాహ వేడుక కోసం భర్తతో కలిసి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి అక్కడికి వచ్చి రివాల్వర్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 24 ఏళ్ల తృప్తి, 28 ఏళ్ల అవినాష్ వాగ్ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తృప్తి తండ్రి రిటైర్డు సీఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ కిరణ్ మాంగ్లే ఇద్దరి ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించాడు.

 

శనివారం రాత్రి చోప్డాలో అవినాష్ సోదరి హల్దీ కార్యక్రమన్ని నిర్వహించారు. తృప్తి, అవినాష్‌ వేడుకకు హాజరయ్యారు. యువతి తండ్రి కిరణ్‌కు విషయం తెలిసింది. దీంతో పెళ్లి జరిగే ప్రాంతానికి అతడు వచ్చాడు. తన సర్వీస్‌ రివాల్వర్‌తో కూతురు తృప్తిపై కాల్పులు జరుపగా, ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. భార్యను కాపాడే ప్రయత్నంతో అవినాష్‌ కూడా కాల్పుల్లో గాయపడ్డాడు.

 

పెళ్లి వేడుకలో పాల్గొన్న అతిథులు ఆగ్రహానికి గురయ్యారు. కాల్పులు జరిపిన కిరణ్‌ను పట్టుకుని చితకబాదారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. తృప్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాల్పుల్లో గాయపడిన అవినాష్‌తోపాటు పెళ్లి అతిథులు కొట్టడంతో గాయపడిన కిరణ్‌ను జల్గావ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 

 

ఇవి కూడా చదవండి: