Published On:

Vishwambhara First Single Out: ‘విశ్వంభర’ ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది.. రామ రామ ఫుల్‌ సాంగ్‌.. బాస్ గ్రేస్ స్టెప్స్ కి షేక్..

Vishwambhara First Single Out: ‘విశ్వంభర’ ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది.. రామ రామ ఫుల్‌ సాంగ్‌.. బాస్ గ్రేస్ స్టెప్స్ కి షేక్..

Vishwambhara Rama Rama Lyrical Song Out Now : విశ్వంభర మూవీ ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి లీడ్‌ రోల్లో ‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి నేడు రామ రామ సాంగ్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటించింది. చెప్పినట్టుగా శనివారం ఫుల్‌ సాంగ్‌ని వదిలింది మూవీ టీం. ఏప్రిల్‌ 12 హనుమాజ్‌ జయంతి సందర్భంగా విశ్వంభర ఫస్ట్‌ సింగిల్‌ని రిలీజ్‌ చేసిన ఫ్యాన్స్‌ ఉత్సవాలను రెట్టింపు చేసింది మూవీ టీం. తాజాగా విడుదలైన ఈ పాట సంగీత ప్రియులను ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. పైగా హనుమాన్‌ జయంతి సందర్భంగా ఈ పాటను విడుదల చేయడం మరింత ప్రాముఖ్యతను అందుకుంటుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో మారుమ్రోగుతుంది.

 

 

శ్రీ..రామ.. శ్రీరామ.. అంటూ సాగే ఈ పాటను శంకర్‌ మహదేవన్‌, లిప్సిక ఆలపించారు. ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించిన ఈ పాటు రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించారు. బింబిసార వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. చివరి భోళా శంకర్‌తో రిజల్ట్‌ను మరిపించేలా విశ్వంభరతో ఓ భారీ హిట్‌ కావాలని అభిమానులంత ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుటుంది.

 

సోషియో ఫాంటసిగా వస్తున్న ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌కి పెద్ద పీట వేశారు. ఇందుకోసం మూవీ టీం ప్రత్యేకంగా శ్రద్ద పెట్టి క్వాలిటీ పరమైన విజువల్స్‌ అందించేందుకు కృషి చేస్తోంది. గ్రాఫిక్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌తో పాటు డబ్బింగ్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో వి వంశీ కృష్ణారెడ్డి, ప్రమోఓద్‌ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆషిక రంగనాథ్‌, కునాల్‌ కపూర్లు కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్‌ ఆలస్యం వల్ల వాయిదా పడింది. అయితే కొత్త రిలీజ్‌ డేట్‌పై త్వరలోనే ప్రకటన రానుంది.