Chiranjeevi Visits Mark Shankar: పవన్ కుమారుడిని చూసేందుకు సింగపూర్ వెళ్లనున్న చిరంజీవి దంపతులు!

Chiranjeevi Visits Pawan Kalyan Son Mark Shankar in Singapore: ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కు (Mark Shankar Pawanovich) గాయాలైన సంగతి తెలిసిందే. స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాసేపటి క్రితమే పవన్ కొడుకు మార్క్ ఆరోగ్యంపై స్పందించారు. ఇక మార్క్‌ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి సింగపూర్ వెళ్లనున్నారట. ఆయన సతీమణి సురేఖతో కలిసి ఆయన సింగపూర్ వెళ్తున్నట్టు సమాచారం. మరికొద్ది సేపట్లో స్పెషల్ ప్లైయిట్‌లో వారు సింగపూర్‌కు బయలుదేరనున్నారని ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్.
కాగా మార్క్ అగ్ని ప్రమాదంలో గాయపడినట్టు మంగళవారం ఉదయం సమాచారం అందింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అరకు పర్యటనలో ఉన్నారు. ఉదయం పర్యటనలో ఉండగా తనకు ఫోన్ వచ్చిందని, అయితే అది చిన్న ప్రమాదమని అనుకున్నట్టు తాజాగా మీడియాలో సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. తన కొడకు ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టిన రోజునే మార్క్ ప్రమాదంలో గాయపడటం దురద్రష్టకమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్క్‌కు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుందని, అతడికి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ప్రమాదంలో మార్క్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయని ఆయన స్పష్టం చేశారు.
కాగా సింగపూర్‌లోని రివర్ వాలి రోడ్ షాప్ హౌజ్‌అనే అపార్టుమెంటులోని మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అదే సమంయలో మార్క్ రెండవ అంతస్తులోని టమాటో అనే స్కూల్లో ఈస్టర్ క్యాంప్‌లో ఉన్నాడు. కొద్ది రోజులు కిందట శంకర్ అక్కడ కుక్కింగ్ కోర్సులో చేరాడు. అదే టైంలో ప్లోర్‌లో మంటలు చెలరేగడంతో శంకర్‌తో పాటు 30 మంది పిల్లలు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. దీంతో సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ వారిని ఈ ప్రమాదం నుంచి కాపాడింది. అయితే ఈ ఘటనలో ఊపిరి ఆడక ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్టు పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- Court OTT Release Date: ఆఫీషియల్.. కోర్టు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..?