Allu Arjun: అల్లు అర్జున్‌ని పోలీసులు అడిగే ప్రశ్నలు ఇవే?
Allu Arjun Questioned By Police: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. కాసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీసులు స్టేషన్‌కు చేరుకున్న అల్లు అర్జున్‌ను పోలీసులు లోపలికి తీసుకువెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. అయితే నాలుగు వారాల మధ్యంత బెయిల్‌పై అల్లు అర్జున్ బయటకు వచ్చారు.
ఈ కేసులో విచారణకు రావాలని సోమవారం పోలీసులు బన్నీకి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం అల్లు అర్జున్ తన లీగల్ టీంతో కలిసి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో బన్నీని అడిగే ప్రశ్నలపై ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ను దర్యాప్తు అధికారి ఏసీపీ రమేష్ కుమార్‌తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీలు విచారించనున్నారు. ఈ కేసులో 11వ ముద్దాయిగా ఉన్న అల్లు అర్జున్‌ను విచారణలో భాగంగా పోలీసులు అడిగే ప్రశ్నలేంటీ ఇక్కడ చూద్దాం!
- అల్లు అర్జున్‌ని అడగబోయే ప్రశ్నలు
- గతంలో సినిమా చూసేందుకు సంధ్య థియేటర్ ఎన్నిసార్లు వచ్చారు
- థియేటర్ దగ్గర మీరేందుకు ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చింది
- రోడ్ షో కోసం ఎంతమంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు?
- పోలీసుల అనుమతి లేదన్న విషయం మీకు తెలుసా? తెలియదా?
- సంధ్య థియేటర్‌కి రావద్దని మీకు ముందే యాజమన్యం చెప్పిందా?
- ప్రీమియర్ షోకు వచ్చేందుకు అనుమతి కోరారా? ఆ కాపీ ఏమైనా ఉందా?
- మీరు గానీ, మీ పీఆర్ టీం గానీ పోలీసుల అనుమతి తీసుకున్నారా
- తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది?
- రేవతి చనిపోయిన విషయాన్ని మీకు ముందుగా ఎవరు చెప్పారు?
- నిజంగానే మరుసటి రోజు వరకు తొక్కిసలాట జరిగింది? ఈ ఘటనలో మహిళ మృతి చెందిన విషయం తెలియదా?
- విషయం తెలిసిన వెంటనే మీరేందుకు థియేటర్ నుంచి వెళ్లలేదు?
- మీ దగ్గర పోలీసులు వచ్చిన ఈ విషయం చెప్పారా? లేదా?
- సినిమా ప్రారంభం అయ్యాక కాసేపటికే మీకు విషయం తెలిసినా ఎందుకు సినిమా చూస్తూనే ఉన్నారు