Tata Curvv Suv Price: ఝలక్‌ల మీద ఝలక్‌లు.. కారు లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన టాటా కర్వ్ ధర!

Tata Curvv Suv Price Hiked: భారతదేశపు అగ్రగామి ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కార్ల ధరలను మారుస్తోంది. కంపెనీ ఇటీవల దాని ఎస్‌యూవీలలో ఒకటైన టాటా కర్వ్ కూపే ఎస్‌యూవీ ధరను పెంచింది. కర్వ్‌ను కొనడం ఇప్పుడు ఖరీదైనదిగా మారింది. అయితే ప్లస్ వేరియంట్,స్మార్ట్ డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు ఏ ఎస్‌యూవీ ధర మారిది? ఈ ఎస్‌యూవీని ఎంత ధరకు కొనుగోలు చేయచ్చు?. ఎస్‌యూవీలు ఎంత ఖరీదైనవి అవుతున్నాయి? తదితర వివరాలు తెలుసుకుందాం.
టాటా మోటార్స్ కూపే ఎస్‌యూవీగా అందించే టాటా కర్వ్‌ను కొనడం ఇప్పుడు ఖరీదైనదిగా మారింది. దీని ధరలను కంపెనీ రూ.13 వేల వరకు పెంచారు. పెరిగిన ధరను వెబ్‌సైట్‌లో కూడా అప్‌డేట్ చేశారు. బేస్ వేరియంట్ ధరలో ఎటువంటి మార్పు లేదు. దాని రెండవ బేస్ వేరియంట్ నుండి ధరలు పెరిగాయి. టాటా కర్వ్ ప్యూర్ ప్లస్ వేరియంట్, స్మార్ట్ డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు. అదే సమయంలో, అన్ని ఇతర వేరియంట్ల ధరలు రూ.3 వేల నుంచి 17 వేలకు చేరుకున్నాయి. ఆటోమేటిక్, సీఎన్‌జీలోని అన్ని వేరియంట్ల ధరలు కూడా పెరిగాయి.
ఈ ఎస్‌యూవీ బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.10 లక్షలుగా ఉంచారు. 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ ఇతర వేరియంట్ల ధర రూ. 11.30 లక్షల నుండి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ ఎస్‌యూవీ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ల ధర రూ. 12.67 లక్షల నుండి రూ. 16.37 లక్షల మధ్య ఉంటుంది, ఎక్స్-షోరూమ్.
1.2 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ 125 పిఎస్ వేరియంట్ల ధర రూ.14.20 లక్షల నుండి రూ.17.70 లక్షల వరకు, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ 125 పిఎస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.16.70 లక్షల నుండి రూ.20 లక్షల వరకు, 1.5 లీటర్ టర్బో డీజిల్ మాన్యువల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.50 లక్షల నుండి రూ.17.83 లక్షల వరకు, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ల ధర రూ.14.30 లక్షల నుండి రూ.19.33 లక్షల వరకు ఉంటుంది.
టాటా కర్వ్ కూపే ఎస్‌యూవీగా మార్కెట్లో అందిస్తున్నారు. ఇది కూపే ఎస్‌యూవీ విభాగంలో సిట్రోయెన్ బసాల్ట్‌తో నేరుగా పోటీపడుతుంది. అదే సమయంలో, ధర పరంగా, ఇది మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ 700, స్కోడా కుషాక్, హోండా ఎలివేట్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి ఎస్‌యూవీలతో కూడా పోటీ పడాలి.
ఇవి కూడా చదవండి:
- Powerful Bike in India: ఈ బైక్స్ వేరే లెవల్ బ్రో.. 400సీసీ సెగ్మెంట్లో టాప్ ఇవే.. లో కాస్ట్.. హై పెర్ఫార్మెన్స్