Allu Arjun: ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు మిస్టర్ పర్ఫెక్ట్స్ .. అదే సినిమాలో కూడా కనిపిస్తే.. షేక్ అవ్వాల్సిందే

Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో జత కడతాడు అనుకుంటే.. దాన్ని పక్కన పెట్టి, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జత కట్టాడు బన్నీ. ఈ సినిమాను ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను పూర్తి చేశాకే బన్నీ.. త్రివిక్రమ్ సినిమా సెట్ లో అడుగుపెట్టనున్నాడు.
దాదాపు ఈ చిత్రం పూర్తయ్యేసరికి ఏడాది అయినా పడుతుంది. ఈలోపు గురూజీ ఖాళీగా ఉండకుండా వెంకీ మామతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇదంతా పక్కన పెడితే.. తాజాగా బన్నీ ముంబైలో సందడి చేశాడు. అక్కడ బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన ఆమీర్ ఖాన్ ను బన్నీ మర్యాదపూర్వకంగా కలిశాడు.
స్వయంగా ఆమీర్ నివాసానికి వెళ్లి మరీ బన్నీ ఆయనను కలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కలిసి కొద్దిసేపు ముచ్చటించుకున్నారని, సినిమాల గురించి, ఇతరత్రా విషయాలను గురించి కూడా మాట్లాడినట్లు సమాచారం. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే సడెన్ గా బన్నీ.. ఆమీర్ ని కలవడానికి కారణం ఏంటి..? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
కొందరు.. అట్లీ సినిమాలో ఆమీర్ కూడా నటిస్తున్నాడు.అందుకే కలిశారు అని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇక ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు మిస్టర్ పర్ఫెక్ట్స్ ను చూస్తుంటే సూపర్ గా ఉందని, వీరిద్దరూ ఒక సినిమాలో నటిస్తే చూడాలని ఉందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.