Allu Arjun-Atlee Movie: సరికొత్త లుక్‌లోకి అల్లు అర్జున్ – అట్లీ మూవీ కోసం రంగంలోకి మహేష్, ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ట్రైయినర్

Allu Arjun Hire Fitness Coach lloyd Stevens For Atlee Movie AA22xA6: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ మూవీ పనులు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా కోసం బన్నీ ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. ఇందుకోసం ఏకంగా హాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైయినర్‌ని రంగంలోకి దింపారు. మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు ఫిట్‌నెస్ ట్రెయినర్‌గా ఉన్న లాయిడ్స్ స్టీవెన్‌ని నియమించుకున్నారు. బన్నీతో కలిసి సెల్ఫీ దిగిన ఫోటోని లాయిడ్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి లోడింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫిట్‌నెస్, మేకోవర్ విషయంలో అల్లు అర్జున్ ఎంత పర్టీక్యూలర్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్క్రీప్ట్ డిమాండ్ మేరకు తన లుక్, స్టైల్‌ని మారుస్తుంటాడు. సినిమా.. సినిమాకు బన్నీ ట్రాన్స్‌పార్మ్ అవుతాడు. దేశముదురు సినిమాతో సిక్స్ ప్యాక్ చేసి చూపించాడు. ఆర్య2 కోసం ఏకంగా స్టైలే మార్చాడు. ఇక పుష్ప సినిమాలకు మొత్తం గెటప్ మార్చేశాడు. ఇలా మేకోవర్స్‌తో ప్రయోగాలు చేస్తుంటాడు. ఇప్పుడు అట్లీ సినిమా కోసం బన్నీ సరికొత్త లుక్‌లోకి మేకోవర్ అవ్వనున్నాడు.
ఇప్పటికే కొత్త హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్న బన్నీ.. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైయినర్ లాయిడ్స్ స్టీవెన్‌తో ఆధ్యర్యంలో ఫిజికల్ ట్రైయినింగ్ సిద్ధమయ్యాడు. ప్రస్తుతం జిమ్‌లో బన్నీ తెగ కసరత్తులు చేస్తూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలోనే సరికొత్త మేకోవర్‌తో అందరిని సర్‌ప్రైజ్ చేయబోతున్నాడన్నామట. ఇది చూసి బన్నీ ఫ్యాన్స్ అంతా తెగ మురిసిపోతున్నారు. ఈ సారి మా ఐకాన్ లుక్ ఏ రేంజ్ ఉంటుందో.. పుష్పతో మాస్ అవతార్‌తో షాకిచ్చిన బన్నీ బాయ్.. అట్లీ సినిమాకు ఎలాంటి లుక్ ప్లాన్ చేశారు, ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
- Netizens Fires On Allu Arjun: అల్లు అర్జున్ తీరుపై నెటిజన్స్ ఆగ్రహం – ‘ఫ్యాన్స్ ఆర్మీ’ ఉత్త మాటేనా..