Published On:

Powerful Bike in India: ఈ బైక్స్ వేరే లెవల్​ బ్రో.. 400సీసీ సెగ్మెంట్లో టాప్ ఇవే.. లో కాస్ట్.. హై పెర్ఫార్మెన్స్

Powerful Bike in India: ఈ బైక్స్ వేరే లెవల్​ బ్రో.. 400సీసీ సెగ్మెంట్లో టాప్ ఇవే.. లో కాస్ట్.. హై పెర్ఫార్మెన్స్

Powerful Bikes in India: ఇండియన్ మార్కెట్లో 400సీసీ బైక్ సెగ్మెంట్‌కు మోడళ్లను డిమాండ్ నిరంతరం పెరగుతుంది. చాలా కంపెనీలు కూడా ఈ సెగ్మెంట్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ఈ విభాగంలోనే తమ ప్రొడక్ట్‌లను విక్రయిస్తున్నాయి. మార్కెట్లో వీటి ధరలు రూ.1.80 లక్షల ఎక్స్‌ షోరూమ్ నుంచి ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో మీరు కూడా రానున్న రోజుల్లో ఈ సెగ్మెంట్‌లో ఓ మంచి బైక్ కొనాలని చూస్తుంటే మీకోసమే ఈ స్టోరీ. ఈ విభాగంలో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న 5 గొప్ప మోటార్ సైకిళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

 

Bajaj Pulsar NS400Z

ఈ విభాగంలో బజాజ్ పల్సర్ NS400Z ఒక గొప్ప ఎంపిక. భారత మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2 లక్షలు. పవర్‌ట్రెయిన్‌గా, ఇందులో 373సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 40బిహెచ్‌పి పవర్, 35ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫీచర్లుగా, బైక్‌లో ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రైడింగ్ మోడ్‌లు, స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉన్నాయి.

 

Yamaha R15 V4

యమహా R15 కొత్త V4 వెర్షన్ కూడా ఈ విభాగంలో ఒక గొప్ప ఎంపిక. భారత మార్కెట్లో ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.84 లక్షలు. పవర్‌ట్రెయిన్‌గా, మోటార్‌సైకిల్ 155సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో  ఉంటుంది, ఇది గరిష్టంగా 18.1బిహెచ్‌పి పవర్, 14.2ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

 

TVS Apache RTR 200 4V

రూ. 2 లక్షల లోపు విభాగంలో టీవీఎస్ అపాచీ RTR 200 4V కూడా ఒక గొప్ప ఎంపిక. ఈ నేకెడ్ మోటార్‌సైకిల్‌లో ప్రీలోడ్ అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ సస్పెన్షన్, మూడు రైడింగ్ మోడ్‌లు, ఏబీఎస్ మోడ్, అడ్జస్టబుల్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.50 లక్షలు. పవర్‌ట్రెయిన్‌గా, ఈ బైక్‌లో 197.75సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో ఉంది, ఇది గరిష్టంగా 20.54బిహెచ్‌పి పవర్, 17.25ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

 

Hero Xtreme 250R

హీరో ఎక్స్‌ట్రీమ్ 250R అనేది 250సీసీ సెగ్మెంట్లో సరికొత్త ఎంట్రీ. భారత మార్కెట్లో హీరో ఎక్స్‌ట్రీమ్ 250R ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.80 లక్షలు. పవర్‌ట్రెయిన్‌గా, ఈ బైక్‌లో 249సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ ఉంది. ఇది గరిష్టంగా 30బిహెచ్‌పి పవర్, 25ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

 

Hero Xpulse 210

మీరు విహారయాత్రలను ఇష్టపడితే హీరో ఎక్స్‌పల్స్ 210 మీకు గొప్ప మోటార్‌సైకిల్. భారత మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.76 లక్షల నుండి రూ.1.86 లక్షల మధ్య ఉంటుంది. ఈ బైక్‌లోని 210సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 24.2బిహెచ్‌పి పవర్, 20.7ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. బైక్‌లో 4.2-అంగుళాల TFT డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రైడ్ , ABS మోడ్‌లు అలాగే పూర్తి LED లైటింగ్ సెటప్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.