Trolls on Jr NTR Name: ఎన్టీఆర్ హిందువు కాదా..? ‘మహమ్మద్ షరీబ్ రసూల్ ఖాన్’ ఇదే ఆయన అసలు పేరా?

Jr NTR Original Name is Mohammad Sharif Rashid Khan..?: ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సోషల్ మీడియాలో తరచూ ఏదోక వార్తలు బయటకు వస్తున్నాయి. నిజాల కంటే ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఇండియా ఆర్మీకి సంబంధించిన ఎన్నో తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. అదే సమయంలో కొందరు ట్రోల్స్, విద్వేషాలకు దిగుతూ నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత్-పాక్ వార్ సెగ తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కు తాకింది.
ఆయన ముస్లిం కాదంటూ ఎన్టీఆర్‌పై తప్పుడు ప్రచారానికి దిగారు. ఇదంత ఎందుకు జరుగుతుంది? ఎవరూ సృష్టిస్తున్నారనేది క్లారిటీ లేదు. కానీ ఎన్టీఆర్ అసలు పేరు ‘మహమ్మద్ షరీబ్ రసూల్ ఖాన్’ అంటూ సోషల్ మీడియా తెగ రచ్చ జరుగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పేరుకు సంబంధించిన ఫోస్ట్స్ దర్శనం ఇస్తున్నాయి. గత రెండు రోజులుగా ఈ ట్యాగ్స్ ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వార్తల్లో నిలిచారు.
దీనికి కారణంగా మహమ్మద్ షరీబ్ రసూల్ ఖాన్ పేరుతో రిజిస్టరైన ఆస్తుల పేరుకు సంబంధించిన డాక్యుమెంట్‌ను వైరల్ చేస్తున్నారు. మెహదీపట్నంలోని ఓ ప్రాపర్టీ మహమ్మద్ షరీబ్ రసూల్ ఖాన్ పేరుతో రిజిస్టర్ అయ్యి ఉంది. అక్కడ తండ్రి పేరు నందమూరి హరికృష్ణ అని ఉండటంతో అంతా షాక్ అవుతున్నారు. ఇదే ఎన్టీఆర్ అసలు పేరు ఇదే, మొదటగా వాళ్ల అమ్మ ఆయనకు ఇదే పేరు పట్టారంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన తాత తారకరామరావు తన పేరును ఆయనకు పెట్టారని అభిప్రాయ పడుతున్నారు.
Jr. NTR ak MOHAMMED SARIB RASOOL KHAN being the biggest RED FLAG EVER : a thread pic.twitter.com/a3bFgIiUhE
— ad (@adbhutuser) May 8, 2025
మరికొందరు మాత్రం ఇది పొలిటికల్ స్ట్రాటజీ, అని ఇదంత ఫేక్ అంటున్నారు. కొందరు కావాలని ఎన్టీఆర్ ఇమేజ్‌పై దెబ్బకొట్టాలనే ఉద్దేశంతోనే కొందరు కావాలనే ఈ పేరును వైరల్ చేస్తున్నారు. ఇక ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఫేక్ అంటూ ఆయన ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఈ పేరు ఎక్కడికి, ఎలాంటి వివాదానికి దారితీస్తోందోనని తారక్ ఫ్యాన్స్ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్.. నందమూరి హరికృష్ణ రెండో భార్య కుమారుడనే విషయం తెలిసిందే. తారక్ తల్లి ముస్లిం అనే ప్రచారం ఉంది. మరి వీటన్నింటికి చెక్ పడాలంటే నందమూరి కటుంబ సభ్యులు స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.