Published On:

Harihara Veeramallu: బుక్ మై షోలో వీరమల్లు కొత్త రిలీజ్ డేట్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్

Harihara Veeramallu: బుక్ మై షోలో వీరమల్లు కొత్త రిలీజ్ డేట్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్

Harihara Veeramallu: హరిహర వీరమల్లు..  ప్రేక్షకులకు రోజుకో ట్విస్ట్ చూపిస్తుంది. ఒకేసారి ఆ డేట్ అంటే.. ఇంకోసారి ఈ డేట్ అంటూ అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు మేకర్స్. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ షూటింగ్ ఫినిష్ చేశాడని ఆనందపడేలోపు.. రిలీజ్ డేట్ గురించి ఇంకా క్లారిటీ ఇవ్వకుండా బాధపెడుతున్నారు. దాదాపు ఐదేళ్లు.. బాహుబలి సినిమా కోసం రాజమౌళి కూడా ఇంత టైమ్ తీసుకోలేదు.

 

డైరెక్టర్లు మారారు.. హీరోయిన్లు మారారు. షూటింగ్ ఫినిష్ అయ్యింది. ఇంకా ఏంటి సమస్య. ఇదొక్కదానికే ఎవరికి సమాధానం దొరకడం లేదు. ఆరోజు.. ఈరోజు అంటూనే వస్తున్నారు. కానీ అధికారిక ప్రకటన మాత్రం లేదు. ఇక చివరగా మే 30 న వీరమల్లు వస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. కానీ, అదేరోజు కింగ్డమ్ రిలీజ్ కి కాచుకొని కూర్చుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు.

 

మే 30 న వీరమల్లుకు ఇవ్వడానికి నాగవంశీ ససేమిరా అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గురూజీ మాట్లాడినా పని అవ్వలేదట. ఇక తరువాతి నెలలో వీరమల్లు రిలీజ్ ఉంటుంది అనేది కొందరి మాట. ఈ నేపథ్యంలోనే బుక్ మై షో అభిమానులకు షాక్ ఇచ్చింది. హరిహర వీరమల్లు జూన్ 12 న రిలీజ్ కానున్నట్లు తెలుపుతూ పోస్టర్ పెట్టడం సంచలనంగా మారింది.

 

సడెన్ గా ఈ పోస్టర్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. నిజంగా వీరుమాళ్ళు జూన్ 12 న  వస్తుందా .. ? లేక బుక్ మై షో కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి.. అలా రివీల్ చేసినా.. ? అనేది తెలియాల్సి ఉంది. జూన్ అంటే.. కుబేర, కన్నప్ప సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరి వాటితో వీరమల్లు పోటీపడి నిలబడతాడా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.