Allu Arjun: అల్లు అర్జున్ ఎవరి తాలూకానో తెలుసా.. ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే

Allu Arjun: అల్లు అర్జున్ ఈ ఏడాది పుష్ప 2 తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. విజయంతో పాటు వివాదాలను కూడా కొనితెచ్చుకొని జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని కోసం లుక్ మొత్తం మార్చేశాడు. ఇక బన్నీ ఎప్పుడు స్టైలిష్ గానే కనిపిస్తూ ఉంటాడు. అతని స్టైల్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు.
ఎయిర్ పోర్ట్ లో, బయట ఎక్కడైనా బన్నీ కనిపిస్తే అతని టీ షర్ట్స్, షర్ట్స్ గురించే చర్చ నడుస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్.. ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెల్సిందే. అందులో మీమ్స్ తో టీ షర్ట్స్ కూడా వచ్చాయి. అలాంటి టీ షర్ట్స్ ను యూత్ తెగ వాడేస్తున్నారు. అయితే తాజాగా బన్నీ కూడా ఇలాంటి మీమ్ టీ షర్ట్ ను ధరించడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.
అనగనగా ఒకరోజు సినిమాలో బ్రహ్మానందం ఫేమస్ డైలాగ్ నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా గుర్తుందా.. నెల్లూరి పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే పోలీస్ స్టేషన్ నడుపుతున్నారా.. ? అని బ్రహ్మీ చెప్తాడు. ఇక మీమ్స్ లో ఈ డైలాగ్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఆ డైలాగ్ తో ఉన్న టీ షర్ట్ ను బన్నీ ధరించి కనిపించాడు.
నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా అని రాసి ఉండడమే కాకుండా బ్రహ్మీ ఫేస్ కూడా టీ షర్ట్ మీద ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. మొన్నటివరకు పవన్ అభిమానులు.. తాము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా.. డిప్యూటీ సీఎం గారి తాలూకా అని రాసి ఉన్న స్టిక్కర్స్, టీ షర్ట్స్ వేసుకొని చూపించారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ఎవరి తాలూకానో తెలుసా.. నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.