Allu Arjun-Atlee ఏంటీ.. అల్లు అర్జున్-అట్లీ మూవీ ప్రారంభోత్సవం జరిగిపోయిందా?!

Allu Arjun and Atlee Movie Wrap Up Pooja: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హిట్ చిత్రాల డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బన్నీ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ 22వ సినిమా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. సైన్స్ ఫిక్షన్‌గా బ్యాక్‌డ్రాప్‌లో ఇండియాలోనే ఇప్పటి వరకు రాని జోనర్‌లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు అట్లీ.
బన్నీ లుక్ టెస్ట్ పూర్తి..
ఇందుకోసం అట్లీ దగ్గరుండి మరి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇటీవల ముంబైలోని ప్రముఖ స్టూడియోలో అల్లు అర్జున్ లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫొటో షూట్ జరిగినట్లు తెలుస్తోంది. బన్నీ పాత్ర కోసం అట్లీ డిఫరెంట్ లుక్స్ ట్రై చేశాడట, రగ్గడ్ నుంచి స్టైలిష్ వరకు విభిన్న స్టైలిష్ లుక్స్ ట్రై చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ వర్క్ పూర్తయ్యింది, ఇక త్వరలోనే గ్రాండ్ లాంచ్, షూటింగ్‌కి భారీ ఎత్తున్న మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా బజ్ ప్రకారం ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమం జరుపుకుందట. ముంబైలో సైలెంట్‌గా ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేశారట. కేవలం హీరో, దర్శక-నిర్మాతలతో పాటు ఇతర టీం సభ్యులతో కలిసి సైలెంట్ ముంబైలో మూవీ పూజ కార్యక్రమాన్ని జరిపిపించిన ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముంబైలో పూజ కార్యక్రమం
ఇది తెలిసి ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అయ్యాయట. ఇదంత చూస్తుంటే డైరెక్టర్ రాజమౌళి బాటలోనే అట్లీ కూడా వెళ్తున్నట్టు అర్థమైపోతుంది. అభిమానుల్లో,ఆడియన్స్‌లో ఎంతో క్రేజ్ ఉన్న SSMB29 విషయంలో జక్కన్న చాలా గొప్యత పాటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్స్, లీక్స్ లేకుండ జాగ్రత్త పడుతున్నారు మూవీ లాంచింగ్ కార్యక్రమాన్ని గుట్టుచప్పుడు కాకుండ కానిచ్చేశాడు. ఇప్పుడు అట్లీ కూడా జక్కన్న మంత్రనే ఫాలో అవుతూ ముంబైలో గప్‌చుప్‌గా AA22xA6 మూవీ పూజ కార్యక్రమాన్ని జరిపించాడట. ఇక సినిమా షూటింగ్ మొత్తం కూడా ముంబైలో, విదేశాల్లోనే జరగనుందట. చూస్తుంటే ఈ సినిమాకు అట్లీ పెద్ద ప్లానే వేశాడనిపిస్తోందంటున్నారు నెటిజన్స్.
కాగా ప్రస్తుతం మూవీ టీం హీరోయిన్ వేటలో ఉందట. నిజానికి అట్లీ సినిమా అంటే హీరోయిన్ ఒక్కరిద్దరు కంటే ఎక్కువ ఉంటారు. అందుకే ఈ సినిమా పలువురి భామల పేర్లు వినిపిస్తున్నాయి. సమంత, జాన్వీ కపూర్ల పేర్లు మొన్నటి వరకు వినిపించాయి. రీసెంట్‌గా మృణాల్ ఠాకూర్ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా లైగర్ భామ అనన్య పాండే పేరు వినిపిస్తుంది. మరి ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని ఫిక్స్ చేస్తారు, గ్లామర్ టచ్ కోసం ఎంతమంది హీరోయిన్లను అనుకుంటున్నాడో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.
#Exclusive @alluarjun @Atlee_dir సినిమాకు
ఇటీవల ముంబాయిలో పూజ చాలా సింపుల్ గా జరిగిపోయింది.
..
సినిమా షూట్ మొత్తం ముంబాయిలో
విదేశాల్లో వుంటుంది.
..— devipriya (@sairaaj44) April 27, 2025