Published On:

Jammu Kashmir: ఇండియాపై పాక్ ఎటాక్.. ధీటుగా బదులిస్తున్న ఆర్మీ

Jammu Kashmir: ఇండియాపై పాక్ ఎటాక్.. ధీటుగా బదులిస్తున్న ఆర్మీ

Missile Attack: పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరుగుతున్నాయి. పహల్గామ్ దాడికి బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపింది. దాడుల్లో 100 మందికి పైగా ముష్కరులు హతమయ్యారు.

 

అయితే భారత్ జరిపిన దాడులతో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వీటిని భారత్ రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పుకొడుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ జమ్ము కాశ్మీర్ ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. జమ్ము ఎయిర్ స్ట్రిప్, సత్వారీ కంటోన్మెంట్ సహా పలు ప్రాంతాల్లో రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో జమ్మూ ఎయిర్ పోర్టు చుట్టూ సైరన్లు మోగుతున్నాయి. అఖ్నూర్, కుప్వారా, కిష్టావర్ ప్రాంతాల్లో కూడా సైరన్లు మోగాయి. కాగా దాడులను ముందే పసిగట్టిన భారత్ ఆయా ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేసింది. జమ్మూ నగరాన్ని బ్లాక్ ఔట్ చేసింది.

 

పాక్ దాడులతో ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయ్యాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా పాకిస్తాన్ ప్రయోగించిన ఎనిమిది మిస్సైల్స్ ను ఎస్- 400 ఎయిర్ ఫోర్స్ ఢిపెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేసింది. పలుచోట్ల డ్రోన్లను డిస్పోస్ చేసింది. కాగా పాక్ కు చెందిన రెండు ఎఫ్- 17, ఒక ఎఫ్- 16 ఫైటర్ జెట్లను ఇండియన్ ఆర్మీ కూల్చి వేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్ లో యుద్ధ వాతావరణం నెలకొంది.

 

మరోవైపు పంజాబ్, రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేశారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కరెంట్ నిలిపివేయనున్నారు. కానీ జైళ్లు, ఆస్పత్రులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఆస్పతులు, జైళ్ల కిటికీలను మాత్రం క్లోజ్ చేసి ఉంచాలని, అత్యవసర సాయం అవసరమైతే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే ప్రజలంతా ఇళ్లలో ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ప్రార్థన స్థలాలు, ప్రాజెక్టులే లక్ష్యంగా దాడులు జరగొచ్చనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం భద్రతను కట్టుదిట్టం చేశారు.