PBKS Vs DC: వర్షంతో ఆలస్యమైన టాస్.. బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. వర్షంతో పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు. అనంతరం అంపైర్లు పిచ్ పరిశీలించిన తర్వాత టాస్ నిర్వహించారు.
కాగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కీలకమైన ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని పంజాబ్, ఢిల్లీ ప్రయత్నిస్తున్నాయి. దీంతో నేటి మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది.
పంజాబ్ కింగ్స్: ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్, నేహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్ దీప్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డుప్లెసిస్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, సుమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, నటరాజన్