Home / BJP
పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే మరియు ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “సబ్కా సాత్, సబ్కా వికాస్” నినాదం అవసరం లేదని, పార్టీ మైనారిటీ విభాగాన్ని తొలగించాలని అన్నారు.
దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలలో జరిగిన 13 అసెంబ్లీ స్దానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి10 సీట్లు, బీజేపీ 2 సీట్లు గెలుచుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 4, హిమాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ లోని ఒక్కో స్దానానికి జూలై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.
ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన మోహన్ చరణ్ మాఝీ పేరు ఖరారయింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కియోంఝర్ నుంచి 87,815 ఓట్ల మెజారిటీతో బీజేడీకి చెందిన మినా మాఝీపై విజయం సాధించారు. బుధవారం ఆయన ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ జరిగింది. రెండు పార్టీలు చెరో 8 సీట్లను గెలుచుకోగా మజ్టిస్ హైదరాబాద్ సీటును నిలుపుకుంది. రెండు పార్టీలకు గత పార్లమెంటు ఎన్నికల్లో పోల్చినపుడు సీట్లు పెరగడం విశేషం. మరోవైపు పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారం చలాయించిన బీఆర్ఎస్ ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది.
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.. బీఆర్ఎస్ సున్నా లేదా ఒకటి మాత్రమే గెలుచుకోవచ్చునని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. హైదరాబాద్ స్థానాన్ని ఎప్పుడూ మాదిరిగానే మజ్లిస్ చేజిక్కించుకుంటుందని వివిధ సర్వే సంస్దలు అంచనా వేసాయి
లోక్ సభ పోలింగ్ ఐదవ విడత సోమవారంతో ముగిసింది. ఎన్నికల వ్యూహకర్త.. జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఓ జాతీయ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో మారు కేంద్రంలో భారతీయ జనతాపార్టీలో అధికారం చేపట్టబోతోందని స్పష్టం చేశారు.
భారతీయ జనతాపార్టీ అబ్ కీ బార్ 400 పార్ అంటూ ఎన్నికలకు ముందు ఈ నినాదం హోరెత్తించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి అమిత్ షా వరకు దేశంలోని ప్రతి బీజేపీ కార్యకర్త అబ్ కీ బార్ 400 పార్ నినాదాన్ని తలెత్తుకున్నాడు. అయితే ప్రారంభంలో ఉన్న జోష్ ఇప్పుడు మాత్రం కనపడ్డం లేదు
కాంగ్రెస్ పార్టీకి మాజీ డిల్లీ కాంగ్రెస్ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీ ఝలక్ ఇచ్చాడు. రెండు రోజుల క్రితం తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని చెప్పిన అర్విందర్సింగ్ లవ్లీ శనివారం నాడు బీజేపీ కండువ కప్పుకున్నాడు. ఇక అర్విందర్ రాజీనామా చేయడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీపార్టీతో పొత్తు పెట్టుకోవడమే. ఆప్తో పొత్తును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అబ్ కీ బార్ 400 పార్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే 400 పై చిలుకు సీట్లు సాధిస్తామనేది ఆయన ధీమా. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ మాత్రం 400 పార్ ఓ పెద్ద జోక్, 300 పార్ అసంభవం.. 200 పార్ అతి పెద్ద చాలెంజ్ అని అన్నారు.
న్నికల వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రది మోదీ పై విరుచుకు పడుతున్నారు .మోదీ తెలంగాణకు చేసింది ఏమి లేదు గాడిద గుడ్డు అంటూ సెటైరికల్ గా ప్రచారం చేతున్న రేవంత్ రెడ్డి తాజాగా మరో సారి హాట్ కామెంట్స్ చేసారు . రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.