Home / BRS
Ponguleti Srinivas Reddy Sensational Comments: తెలంగాణలో పోలిటికల్ బాంబులు పేలే అవకాశముందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ప్రతినిథితో మాట్లాడుతూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పెలబోతున్నాయి.. ఇందులో అందరూ ప్రధాన నేతలే ఉంటారన్నారు. ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంతో పాటు పలు 10 అంశాల్లో నిజాలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచబోతున్నామంటూ బాంబ్ పేల్చారు. […]
గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. టీ కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్శ్ దెబ్బకి గులాబీ పార్టీ చతికిలపడిపోతోంది. ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి హస్తం గూటికి చేరుతుండడంతో గులాబీ పార్టీ ఖాళీ అవుతోంది
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మాజీ స్పీకర్ పోచారం నివాసాన్ని సందర్శించారు
: బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంతోషాన్ని ఇచ్చాయని.. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు శాతం పెరిగిందని రేవంత్ అన్నారు.
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.. బీఆర్ఎస్ సున్నా లేదా ఒకటి మాత్రమే గెలుచుకోవచ్చునని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. హైదరాబాద్ స్థానాన్ని ఎప్పుడూ మాదిరిగానే మజ్లిస్ చేజిక్కించుకుంటుందని వివిధ సర్వే సంస్దలు అంచనా వేసాయి
బీఆర్ఎస్, కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలలో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండు లేదా మూడు సీట్లు గెలుచుకోవచ్చని జోస్యం చెప్పారు. కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిపాజిట్ కూడా రాదన్నారు.మెదక్‌లో బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఒక్క సీటూ గెలవదన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ బృందం లండన్ నగరంలో పర్యటించింది. ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనం రేవంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పై హాట్ కామెంట్స్ చేశారు రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో 100 మీటర్ల లోతులో బొంద పెడతామని రేవంత్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల మధ్యకి వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ క్యాడర్‌తో తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడారు. ఫిబ్రవరి నెలనుంచి కేసీఆర్ ప్రతిరోజూ తెలంగాణ భవన్‌కి ప్రతిరోజూ వచ్చి కార్యకర్తలని కలుస్తారని హరీష్ రావు తెలిపారు.
కాంగ్రెస్ చేతిలో పార్టీ పరాజయం పాలైనందుకు తీవ్ర నిరాశకు లోనయినా చింతించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కేటీఆర్ ) అన్నారు. ప్రజాతీర్పును శిరసావహించి సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసారని అన్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అందులో భాగంగానే పలు రాజకీయ పార్టీల అగ్ర నేతలు ఇవాళ అధిక ప్రాంతాల్లో పర్యటన చేయనున్నారు. ఇక మరోవైపు సాయంత్రం ఐదు గంటల నుంచి రోడ్డులన్నీ నిర్మానుష్యం కానున్నాయి. 13 జిల్లాలో సాయంత్రం