Published On:

Heavy Rains: జమ్ముకాశ్మీర్ లో భారీ వర్షం.. పాకిస్తాన్ కు ఒక్కసారిగా భారీ వరద

Heavy Rains: జమ్ముకాశ్మీర్ లో భారీ వర్షం.. పాకిస్తాన్ కు ఒక్కసారిగా భారీ వరద

India: భారీ వర్షాలు జమ్ముకాశ్మీర్ ను అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు భారీ వర్షాలతో చినాబ్ నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో ఆ నదిపై నిర్మించిన బాగ్లిహార్ డ్యామ్ గేట్లను ఒక్కసారిగా తెరిచారు. దీంతో దిగువన పాకిస్తాన్ ఒక్కసారిగా వరద పోటెత్తింది.

 

కాగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ పై భారత్ అన్ని వ్యూహాత్మక, వాణిజ్య ఒప్పందాలను తెంచుకుంది. అలాగే సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అందులో భాగంగానే పాకిస్తాన్ కు నీటిని విడుదల చేయకుండా అన్ని ప్రాజెక్టుల గేట్లను మూసి వేసింది. దీంతో పాకిస్తాన్ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. అలాగే పాకిస్తాన్ లో పంటలకు ప్రధానమైన నీటి వనరు సింధూ జలాలే. భారత్ సింధు జలాలను నిలిపివేయడంతో పాకిస్తాన్ లో పంటలపై తీవ్ర ప్రభావం పడనుంది. దీంతో పాకిస్తాన్ లో రానున్న రోజుల్లో తీవ్ర ఆహార కొరత రానుంది. కానీ ప్రాజెక్టులు నిండటంతో వాటి భద్రతకోసం భారత్ ఒక్కసారిగా బాగ్లీహార్ ప్రాజెక్టు గేట్లను ఓపెన్ చేసింది. దీంతో పాకిస్తాన్ భారీగా వరదలు ముంచెత్తనున్నాయి. చినాబ్ నది ఒడ్డున ఉన్న ముజఫరాబాద్, సియాల్ కోట్ పట్టణాలకు వరద ముప్పు ఏర్పడింది.