Home / Congress
Rouse Avenue Court On National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురిపై ఈడీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జులై 29న దీనిపై తీర్పు వెల్లడించనున్నట్టు ప్రకటించింది.కాంగ్రెస్ అగ్రనేతలు రూ. 2 వేల కోట్ల మేరకు నేరపూరిత కుట్ర, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ […]
Election Commission: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ విరుచుకుపడ్డారు. బీహార్ లో ఈసీ ఎన్నికల దొంగతనానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ లో ఓటర్ల జాబితాను సవరించాలని ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. అయితే ఈసీ నిర్ణయంపై పలు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఓటర్ల జాబితాను సవరించడం ఈసీ చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో […]
Telangana Government: ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ. 5 కే టిఫిన్ అందించే పథకం అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇవ్వబోయే బ్రేక్ ఫాస్ట్ మెనూను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సిద్ధం చేసింది. ఈ నిర్ణయంతో ప్రజల నుంచి ఒక్కో ప్లేట్ టిఫిన్ కోసం రూ. 5 మాత్రమే వసూలు చేయనుంది. మిగిలిన రూ. 14 ఖర్చును ప్రభుత్వం భరించనుంది. ఒక్క టిఫిన్ కు రూ. 19 ఖర్చు అవుతుందని అంచనా […]
Emergency Period: దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులపై కాంగ్రెస్ నేత, ఎంపీ హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా తీవ్ర విమర్శలు చేస్తూ ఓ ఆర్టికల్ లో రాసుకొచ్చారు. ఎమర్జెన్సీని ప్రకటించడం ఓ చీకటి అధ్యాయం, ఆ చీకటి అధ్యాయం నుంచి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఎమర్జెన్సీ సమయంలో అందరి స్వేచ్ఛను హరించారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణచి వేసే ప్రయత్నం చేశారని ప్రాజెక్ట్ సిండికేట్ […]
Telangana Governement introducing Adhinethri workshop for Women: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు నాయకత్వ ప్రతిభను మరింత పెంపొందించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలో తెలంగాణలో అధినేత్రి వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. చట్ట సభల్లో మహిళలకు సీట్లు పెరగనున్న సందర్భంగా కింది స్థాయి నుంచి మహిళ నాయకులకు నాయకత్వ లక్షణాలను మరింత పెంపొందించి వారిని ఒక గొప్ప నాయకులుగా తీర్చిదిద్దే […]
TPCC appointed district In-charges: రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జ్ లను నియమిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు ఇచ్చారు. పార్టీని సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ వారికి సూచించారు. ఈ మేరకు 10 మంది ఉమ్మడి జిల్లాల ఇంఛార్జ్ లతో ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో జిల్లాల ఇంఛార్జ్ ల విధివిధానాలను మీనాక్షి నటరాజన్ వివరించారు. […]
CM Revanth 2 Days Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. కేంద్రం పెద్దలతోపాటు, కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు జరపనున్నారు. రాష్ట్రానికి రావల్సిన ప్రాజెక్టులపై కేంద్రం పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ హైకమాండ్ కు వివరించనున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్ తో పాటు రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర, దక్షిణ భాగాలపై […]
New Delhi: సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిసింది. అలాగే మెట్రో […]
KTR Challenge To CM Revanth: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రైతు రాజ్యం ఎవరిదో తేల్చుకునేందుకు చర్చ పెడదాం రావాలని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నానని అన్నారు. జులై 8న ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని తెలిపారు. 72 గంటలు సమయం ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయ్యి రావాలి. రైతులకు […]
Rahul On PM Modi: అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో ప్రధాని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలకు ప్రధాని మోదీ తలొగ్గుతారని, ఈ విషయంలో కేంద్రమంత్రి పీయుష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప మరేం చేయలేరని విమర్శించారు. తన మాటలను రాసిపెట్టుకోవాలంటూ సవాల్ చేశారు. మూడు నెలల క్రితం భారత్ పై అమెరికా 26 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది. […]