Published On:

2 Black Cobra’s Fight: గెలుపు ఎవరిదో.. రెండు బాక్ల్ కోబ్రాల మధ్య భీకర ఫైట్..!

2 Black Cobra’s Fight: గెలుపు ఎవరిదో.. రెండు బాక్ల్ కోబ్రాల మధ్య భీకర ఫైట్..!

Fear Less Fight between 2 Big Black Cobras: కింగ్ కోబ్రా జాతుల్లో అత్యంత విషపూరితమైనది బ్లాక్ కింగ్ కోబ్రా. ఆ పాము చూడటానికి నలుపు రంగులో కనిపించినప్పటికీ, దీన్ని కింద భాగంలో తెలుపు రంగును కలిగి ఉంటుంది. భారతీయులు బ్లాక్ కింగ్ కోబ్రాను నల్లత్రాచు లేదా రాచనాగు అని పిలుస్తారు. దీనికి ఉన్న నలుపు రంగు దాని గంభీరమైన రూపం ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంది. నలుపు రంగు నాగుపాములు 10 నుంచి 15 అడుగుల పొడవు కలిగి ఉంటాయి. కొన్ని18 అడుగుల పొడవును కలిగి ఉంటాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఇది నలుపు రంగులో ఉన్నప్పటికీ శరీరంపై కటిక నలుపు రంగుతో కూడిన చారలు కలిగి ఉంటాయి. అన్ని పాముల కంటే చాలా ఆగ్రహాన్ని కలిగి ఉంటాయి. కింగ్ కోబ్రా పాములు ప్రత్యేకమైన కళ్లను కలిగి ఉంటాయి.

 

ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి..

నలుపు రంగు కింగ్ కోబ్రాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. దక్షిణ, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాలు, భారత్, బంగ్లా, మయన్మార్, థాయిలాండ్‌ల్లోని చిత్తడి నేలల్లో నివసిస్తాయి. ఇవి పుట్టే క్రమంలో సాధారణ రంగు ఉన్నప్పటికీ జన్యుపరమైన కారణాలవల్ల నలుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఎక్కువగా దట్టమైన అడవులు, వెదురు పొదలు, వ్యవసాయ భూముల్లో ఉండేందుకు ఇష్టపడతాయి. నీటి వనరులు దగ్గరగా ఉండే ప్రదేశాల్లో జీవిస్తాయి. క్రిమి కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి.

 

జనావాసాల్లో సంచారం..

నలుపు రంగుతో కూడిన కింగ్ కోబ్రాలు చాలా అరుదుగా జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొంతమంది కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా రెండు బ్లాక్ కింగ్ కోబ్రాలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఒక కింగ్ కోబ్రా మరో పాముపై దాడి చేస్తోంది. రెండు పాములు ఒకదానికొకటి దాడి చేసుకుంటున్నాయి. చివరికి ఒక పాము ఓడిపోయి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒక నెటిజన్ పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి: