Last Updated:

Captain Amarinder Singh: ఈ నెల 19న బీజేపీలో విలీనం అవుతన్న అమరీందర్ సింగ్ పార్టీ

మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ సెప్టెంబరు 19న బీజేపీలో విలీనం కానుంది. గత ఏడాది చివర్లో సీఎం పదవి నుండి తొలగించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన అమరీందర్ సింగ్ కొత్త రాజకీయ పార్టీ- పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పిఎల్ సి )ని స్థాపించారు.

Captain Amarinder Singh: ఈ నెల 19న బీజేపీలో విలీనం అవుతన్న అమరీందర్ సింగ్ పార్టీ

Punjab: మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ సెప్టెంబరు 19న బీజేపీలో విలీనం కానుంది. గత ఏడాది చివర్లో సీఎం పదవి నుండి తొలగించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన అమరీందర్ సింగ్ కొత్త రాజకీయ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పిఎల్ సి )ని స్థాపించారు. అమరీందర్ పార్టీ అధినేత జేపీ నడ్డా సమక్షంలో అధికారికంగా బీజేపీలో చేరనున్నారు. అతని కుమారుడు రణ్ ఇందర్ సింగ్, కుమార్తె జై ఇందర్ కౌర్, మనవడు నిర్వాన్ సింగ్ కూడా బీజేపీలో చేరనున్నారు. అమరీందర్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. అక్కడ వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్నారు.

పాటియాలా రాజకుటుంబానికి చెందిన వారసుడు మరియు రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన సింగ్, గత సంవత్సరం కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన తర్వాత పిఎల్ సి ని ప్రారంభించారు. పిఎల్ సి 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరియు సుఖ్‌దేవ్ సింగ్ ధిండా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (సంయుక్)తో పొత్తుతో పోటీ చేసింది.

అయితే పీఎల్సీ అభ్యర్థులు ఎవరూ విజయాన్ని నమోదు చేయలేకపోయారు, అమరీందర్ స్వయంగా తన సొంత గడ్డమైన పాటియాలా అర్బన్ స్థానం నుండి ఓడిపోయారు.

ఇవి కూడా చదవండి: