Home / Political News
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన చర్చా వేదికలో రాహుల్ పాల్గొన్నారు. హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం లో పూర్తి స్థాయి క్యాబినెట్ కొలువు తీరింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంది ఇప్పటికే ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా శనివారం మరో 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో 34 మందితో సీఎం సిద్ధరామయ్య క్యాబినెట్ పూర్తిగా సిద్ధమైంది.
రూ. 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చకునేందుకే నరేంద్ర మోదీ సర్కారు 2 వేల నోట్ల ఉపసంహరణ చేసిందని ఆయన తెలిపారు. ఈ అంశంపై విచారణ జరపాలని ఖర్గే డిమాండ్ చేశారు.
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఎంపిక అయిన విషయం తెలిసిందే. తొలి నుంచి సీఎం రేసులో ఉన్న మరో నాయకుడు డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తూ కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దాని పై చర్చ నడుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ లో అత్యంత ముఖ్యలైన పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యల వర్గీయుల మధ్య సీఎం పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఏ రాష్ట్రంలో నైనా అక్కడి పరిస్థితుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని.. కర్ణాటకలో బీజేపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదన్నారు.
కల్యాణ రాజ్యప్రగతిపక్ష పేరుతో పార్టీని స్థాపించి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడ్డారు గాలి జనార్థన్‌రెడ్డి. అయితే, ఫలితాల్లో మాత్రం ఆయన ఒక్కరే విజయం సాధించడం విశేషం.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ దూసుకెళ్లింది. పరిస్థితులు అనుకూలిస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశం డీకే శివకుమార్ కు ఉంది.
కర్ణాటకలో ఎన్నికలు ముగిశాయి. మే 13 (శనివారం) రాజకీయ పార్టీల భవితవ్యం తేలిపోనుంది. దీంతో నాయకుల్లో కొత్త ఆందోళనలు నెలకొన్నాయి.
Karnataka Exit Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఎన్నిక ముగిసిన తర్వాత.. ఎగ్జిట్ పోల్ సర్వేలు ఆయా పార్టీల విజయావకాశాలను అంచనా వేశాయి.