Single Cigarette: పొగరాయుళ్లకు షాక్.. సింగిల్ సిగరెట్లు అమ్మకంపై కేంద్రం నిషేధం
ధర భారీగా పెరిగినా సిగరెట్ల వాడకం తగ్గలేదని పార్లమెంటరీ స్థాయీ సంఘమే స్వయంగా వెల్లడించింది. ధర పెరగితేనేం పెట్టె కొనే చోట.. అరపెట్టే కొంటాం లేదా ఒక్క సిగరెట్ కొంటాం కానీ ఊదడం మాత్రం మానవు అంటున్నారు పొగరాయుళ్లు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Single Cigarette: ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వం ఎన్ని యాడ్స్ ఇచ్చినా పొగరాయుళ్లకు మాత్రం అవేమీ పట్టవు. సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా తాగుతుంటారు. వాటి ధర ఎంత పెరిగినా కానీ వాటిని కొనటం కానీ తాగటం కానీ మానలేదు. రోజుకు పెట్టపెట్టెలు కాల్చేవారున్నారు. ఇక చైన్ స్మోకర్స్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు ఎన్ని బాక్సులు ఊదేస్తారో వారికే తెలియదు..
కేంద్రం కీలక నిర్ణయం
ధర భారీగా పెరిగినా సిగరెట్ల వాడకం తగ్గలేదని పార్లమెంటరీ స్థాయీ సంఘమే స్వయంగా వెల్లడించింది. ధర పెరగితేనేం పెట్టె కొనే చోట.. అరపెట్టే కొంటాం లేదా ఒక్క సిగరెట్ కొంటాం కానీ ఊదడం మాత్రం మానవు అంటున్నారు పొగరాయుళ్లు. పెట్టె ధర పెరగడం వల్ల చాలా మంది బాక్సు మొత్తం కొనుక్కోలేక సింగిల్ సిగిరెట్ ని విడిగా కొనుక్కుని తాగుతుంటారు. అలా సింగిల్ సిగిరెట్ల వాడకం కూడా భారీగా పెరిగింది. అయితే దీనిపై ఫోకస్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం ధూమపానాన్ని అరికట్టేందుకు ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై సింగిల్ సిగరెట్ల అమ్మకం ఉండకపోవచ్చు. ఎందుకంటే కేంద్రం సింగిల్ సిగరెట్ల అమ్మకాలపై నిషేధం విధించనుంది. దీనితో ఇకపై బాక్సు మొత్తం కొనుక్కోవాల్సి ఉంటుంది.
సింగిల్ బంద్ ఇకపై బాక్సే
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సిగరెట్లను విడిగా అంటే లూజుగా అమ్మకాలు జరపడాన్ని నిషేధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం సిగరెట్లను విడిగా విక్రయించడంపై నిషేధం విధించాలని యోచిస్తోంది. సిగరెట్లను లూజుగా విక్రయిస్తుండడంతో పొగాకు వినియోగం తగ్గడం లేదని, పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా దేశంలో ఏటా 3.5 లక్షల మంది మరణిస్తున్నారని పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొనింది.
ఒక్కో సిగరెట్ పై ట్యాక్స్ ఎంతో తెలుసా..
పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు పన్నులు పెంచుతున్నా ఫలితం ఉండడం లేదని కమిటీ అభిప్రాయపడింది. సిగరెట్‌పై ప్రస్తుతం అత్యధికంగా 28 శాతం జీఎస్టీ ఎక్సైజ్ సుంఖం ఇలా పలు రకాల పన్నులన్నీ కలిపి లెక్కేస్తే ఒక్కో సిగరెట్ ధరలో 64 శాతం వరకు ట్యాక్స్ ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఇంత ట్యాక్స్ ఉన్నా కానీ పొగరాయుళ్లకు ఇవేమీ పట్టడం లేదని, సిగరెట్ వినియోగంతో నోటి క్యాన్సర్ ముప్పు కూడా అంతకంతకూ పెరుగుతోందని తెలిపింది. అయినా పొగరాయుళ్లు మాత్రం పొగాకు వాడకం మానటంలేదని ఇది వారి ఆరోగ్యానికే కాక ఆర్థికంగానే నష్టం జరుగుతుందని వెల్లడించింది.
Banning tobacco advertising, promotion and sponsorship is one of the best ways to protect young people from starting smoking as well as reducing tobacco consumption across the entire population #NoTobacco🚭 https://t.co/TyRShN86DO pic.twitter.com/W1xHqSHEv2
— World Health Organization (WHO) (@WHO) September 24, 2018
WHO ఏం చెప్తుంది..?
పొగాకు బలహీనతగా మారడం వల్ల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోని పరిస్థితికి పొగరాయుళ్లు చేరుకుంటున్నారని పేర్కొనింది. ఇక దీనిపై గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించిందని.. సిగరెట్లపై పన్ను భారాన్ని 75 శాతం వరకు పెంచాలని సూచించిందని కేంద్రం వెల్లడించింది. కమిటీ సిఫార్సుల నేపథ్యంలో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో లూజ్ సిగరెట్లపై నిషేధం విధిస్తూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేస్తారని సమాచారం. మరి ఇకనైనా దేశంలో పొగాకు వాడకం తక్కువవుతుందా లేదా చెప్పేవాళ్లు చెప్తూనే ఉంటారు మాకేం పట్టింది అన్నట్టు పొగరాయుళ్లు వాళ్లపని వాళ్లు చేసుకుంటూ వెళ్తారో లేదో వేచి చూడాలి. రూల్స్ తెచ్చే కేంద్రం వాటి అమలును ఏ మేరకు చేస్తుందనే చూడాలి.
ఇదీ చదవండి: ఢిల్లీలో మైనర్ బాలికపై యాసిడ్ దాడి