Nandamuri Balakrishna: నేడు పద్మ భూషణ్ అవార్డు అందుకోనున్న నందమూరి బాలకృష్ణ

Today Nandamuri Balakrishna Receives Padma Bhushan Award: నందమూరి బాలకృష్ణ నేడు పద్మ భూషణ్ అవార్డును అందుకోనున్నాడు. ఈ ఏడాది గణతంత్ర దినొత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జవనరి 25న పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ(ఏప్రిల్ 28) రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డుల ప్రదానొత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ అవార్డును అందుకోనున్నాడు. దీంతో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
అలాగే అభిమానులు సోషల్ మీడియాలో వేదికగా పండుగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో పద్మభూషణ్ అవార్డు తీసుకోనుండటం తమకు ఎంతో గర్వకారణమంటూ ఆనందంలో మునిగితేలుతున్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలను అందిస్తోన్న ప్రముఖలకు కేంద్రం మొత్తం 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. వారిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మంది పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించారు. ఇక బాలయ్యతో పాటు సీనియర్ నటి శోభనకు కూడా పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది కేంద్రం. నటుడిగా చలనచిత్ర రంగంలో అందించిన విశేష సేవలకు గానూ నందమూరి బాలకృష్ణకు కేంద్రం ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సత్కరించనుంది.
ఇవాళ జరిగే ఈ కార్యక్రమంలో కోసం బాలయ్య కుటుంబ సమేతంగా ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు, ఏంపీలు, కేంద్రమంత్రుల కూడా ఢిలంలీ వెళ్లారు. కొద్దిసేపటి క్రితం మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్‌రావు, రామ్మోహన్ నాయుడులు బాలయ్యతో కేక్ కట్ చేయించి దీనిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్య సతీమణి వసుధరతో పాటు ఆయన కూతరు నారా బ్రహ్మాణి, అల్లుడు-మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొననున్నారు. కుటుంబ సభ్యులు, టీడీపీ మంత్రుల సమక్షంలో బాలయ్య ఈ అవార్డును అందుకోనున్నారు.
బాలయ్య సినీ ప్రస్థానం
సీనియర్ నటులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారకరామరావు నట వారసుడిగా బాలయ్య చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన 14 ఏళ్ల వయసులో 1974లో ఆయన తండ్రి ఎన్టీఆర్ ‘తాతమ్మ కల’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సహజమే జీవితం చిత్రంతో హీరోగా మారారు. ఇక తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో బాలయ్య వందకు పైగా సినిమాలు చేశారు. యాభై పదుల వయసులోనూ నేటి యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. గత మూడేళ్లుగా వరుసగా.. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్‌తో పాటు వరుసగా రూ. 100 కోట్ల వసూళ్లు సాధిస్తూ రికార్డులు కొల్లగొడుతున్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- Anchor Rashmi: వారం కిత్రం ఆస్పత్రి బెడ్‌పై.. ఇప్పుడు వెకేషన్లో – యాంకర్ రష్మీపై నెటిజన్స్ ఆగ్రహం!