నిర్మలా సీతారామన్: మీడియాలో ప్రకటనలకు వందల కోట్లు ఇస్తారు.. కానీ, ఉద్యోగులకు జీతం ఇవ్వలేకపోతున్నారు- ఏపీ ప్రభుత్వమే టార్గెట్టా?
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ఇన్ డైరెక్ట్ గా ఆమె సెటైర్లు వేశారు.
Nirmala Sitharaman: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ఇన్ డైరెక్ట్ గా ఆమె సెటైర్లు వేశారు.
బుధవారం రాజ్యసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. కాగా దానికి సమాధానం ఇస్తూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని ఓ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడానికి మాత్రం వెనకాడడం లేదంటూ చురకలు అంటించారు. ప్రస్తుతం దేశంలోని ఓ రాష్ట్ర ప్రభుత్వం తన వద్ద ఉన్న డబ్బుతో దేశవ్యాప్తంగా వివిధ మీడియా సంస్థల్లో ప్రకటనలు ఇవ్వడం వల్ల ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేకపోతోందని ఆమె వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఉందని అయినా కానీ.. ఇంకా కొన్ని అప్పులు చేసి మరీ ప్రజలకు ఉచితాలు ప్రకటిస్తుందంటూ ఆమె విమర్శలు గుప్పించారు.
ఉచితాలను బేరీజు వేసుకోవాలి..
ప్రస్తుతం దేశంలో ఓ ప్రభుత్వం తన వద్ద ఉన్న డబ్బుతో దేశవ్యాప్తంగా వివిధ మీడియా సంస్థల్లో ప్రకటనలు ఇచ్చి, ప్రభుత్వ ఉద్యోగులను నానా కష్టాలకు గురిచేస్తోంది అని వారకి మాత్రం సరైన సమయానికి జీతాలు చెల్లించలేకపోతోందని విమర్శించారు. “నేను ఇప్పుడు మీడియాలో వచ్చిన వార్తల గురించి మాత్రమే మాట్లాడుతున్నా ప్రత్యేకంగా ఏ ఒక్క పేపర్ గురించి కూడా చెప్పడం లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు టైంకు శాలరీలను ఇవ్వలేకపోతోందని దానికి గానూ ఉద్యోగస్థులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని పేపర్లలో కథనాలు వచ్చాయి. మీరు కూడా ఆ వార్తలను చూడొచ్చు. నేను ఇక్కడ ప్రత్యేకంగా రాష్ట్రం పేరునూ ప్రస్తావించడం లేదు. బహుశా ఆ ప్రభుత్వం తనవద్ద ఉన్న నిధులను దేశవ్యాప్తంగా వివిధ మీడియా ప్రకటనల కోసం ఉపయోగించడం వల్లే జీతాలు ఇవ్వలేని స్థితికి చేరి ఉండొచ్చని ఆమె సెటైర్లు వేశారు.
బడ్జెట్లో పెట్టి అమలు చేస్తే సులువే..
అందువల్ల ప్రజలకు ఉచితాలను ప్రకటించే ముందు తమ దగ్గర ఉన్న డబ్బు ఎంత.. వచ్చే ఆదాయం ఎంత, ఇచ్చే సబ్సిడీలు, ఏఏ ఉచితాలను ప్రకటించాలి వంటి అంశాలను బేరీజు వేసుకోవాలని ఆమె ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పిచెప్పకనే ఓ సూచన చెప్పారు. బడ్జెట్లో పెట్టడమే కాకుండా వాటిని పూర్తిగా అమలు చెయ్యాలని దానికి తగిన నిధులు కూడా కేటాయించాలని ఆమె పేర్కొన్నారు. మీకు ఆదాయం వస్తుంటే డబ్బులు ఇవ్వండి, ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ అప్పులు ఎక్కువ చేసీ మరీ ఉచితాలు ప్రకటించాల్సిన పనిలేదు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. ప్రకటనకు అయ్యే ఖర్చును ప్రజలకు వినియోగించవచ్చు అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. విద్య, వైద్యం, రైతులకు సబ్సిడీలు ఇవ్వడం న్యాయమే అంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: భారత్ మళ్లీ ఒమిక్రాన్ కేసులు పెరగనున్నాయా.. చైనాలో కొవిడ్ కేసుల పెరుగుదలకు కారణం ఇదే..!