Akkineni Naga Chaitanya: మరో వంద కోట్లకు ప్లాన్ చేసిన అక్కినేని వారసుడు.. ?

Akkineni Naga Chaitanya: ప్రస్తుతం అక్కినేని వారసుడు అక్కినేని నాగ చైతన్య కెరీర్ గురించి చెప్పమంటే తండేల్ కి ముందు.. తండేల్ కి తరువాత అని చెప్తారు. వరుస ప్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న చైకు.. గీతా ఆర్ట్స్, డైరెక్టర్ చందూ మొండేటి.. తండేల్ సినిమాతో మంచి జోష్ ను అందించారు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా కూడా చేయని చైను మొదటి పాన్ ఇండియా సినిమాతోనే వందకోట్ల క్లబ్ లో చేరేలా చేశాడు. ఇక తండేల్ ఇచ్చిన జోష్ తో చై మరింత హైప్ పెంచేశాడు. ప్రస్తుతం చై నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
తండేల్ తరువాత అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న చిత్రం NC24. విరూపాక్ష సినిమాతో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు బిగ్గెస్ట్ హిట్ ను అందించిన డైరెక్టర్ కార్తిక్ దండు.. ఇప్పుడు చైతో జతకట్టాడు. ఎప్పుడో ఈ సినిమాను మేకర్స్ అనౌన్స్ చేసినా.. ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ చిత్రంలో చై సరసన మీనాక్షీ చౌదరి నటిస్తోంది. ఇప్పటికే చై బర్త్ డే రోజున ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసి మరింత హైప్ క్రియేట్ చేశారు.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ NC24 కి వృష కర్మ అనే టైటిల్ ను ఖరారు చేశారని తెలుస్తోంది. ఈ సినిమాతో చై మరో వంద కోట్లు రాబట్టాలని చూస్తున్నాడట. మిస్టిక్ హర్రర్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. మొదటి నుంచి చైకి దెయ్యాలు అంటే చాలా భయమట. నాగార్జున, సమంత నటించిన రాజుగారి గది 2 కూడా చూడలేదని చై ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కానీ, ఇప్పుడు హిట్ కోసం చై తన భయాలను పక్కన పెట్టాడు.
ఇప్పటికే హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన దూత వెబ్ సిరీస్ లో నటించి హిట్ అందుకున్న చై.. ఇప్పుడు మరో హిట్ కోసం హర్రర్ జోనర్ నే నమ్ముకున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో అక్కినేని వారసుడు అనుకున్నది సాధిస్తాడా.. ? లేదా.. ? చూడాలి.